Covid-19 Study: కొవిడ్ నుంచి కోలుకున్నా ఆ దీర్ఘకాల సమస్య.. వైద్య పరిశోధనల్లో షాకింగ్ విషయాలు
Covid-19 UK Study: కరోనా మహమ్మారి ఆరోగ్యవంతుల జీవితాలను కూడా తలకిందలు చేస్తోంది. మరీ ముఖ్యంగా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపి రోగులను కుంగదీస్తోంది.
కరోనా మహమ్మారి ఆరోగ్యవంతుల జీవితాలను కూడా తలకిందలు చేస్తోంది. మరీ ముఖ్యంగా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపి రోగులను కుంగదీస్తోంది. ఊపిరితిత్తులపై కరోనా వైరస్ చూపే ప్రభావంపై పరిశోధన జరిపిన బ్రిటన్ వైద్య నిపుణులు..షాకింగ్ విషయాలు వెల్లడించారు. కరోనా బాధితుల్లో దీర్ఘకాల ఊపిరితిత్తుల సమస్య ఏర్పడే అవకాశముందని తేల్చారు. కొవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యాక కూడా వారిలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య కొనసాగుతుంది. కనీసం మూడు మాసాలు వారిలో ఆ సమస్య కొనసాగే అవకాశముందని తేల్చారు. కొందరిలో మాత్రం ఈ సమస్య ఏకంగా 9 మాసాల పాటు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
బ్రిటన్‌కు చెందిన షెఫీల్డ్ యూనివర్సిటీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కొవిడ్ నుంచి కోలుకున్న వారి ఊపిరితిత్తుల పనితీరుపై అత్యాధునిక ఇమేజింగ్ ద్వారా వారు అధ్యయనంచేసి ఈ నిర్ధారణకు వచ్చారు. కొవిడ్ నుంచి కోలుకున్న రోగుల ఊపిరితిత్తులో నెలకొనే సమస్యలను సాధారణ సీటీ స్కాన్లు, క్లినికల్ టెస్ట్‌లతోనూ కనిపెట్టేందుకు సాధ్యంకాదు. అందుకే కొన్ని సందర్భాల్లో కరోనా నుంచి కోలుకున్న వారి సీటీ స్కాన్స్ పరిశీలిస్తున్న డాక్టర్లు…అంతా నార్నల్‌గా ఉన్నట్లు చెబుతున్నారు. ఇమేజింగ్ ద్వారా ఊపిరితిత్తులకు సంబంధించి మరింత లోతైన పరిశోధనతో దానికి ఏర్పడిన డ్యామేజ్‌ను పరిశోధకులు గుర్తించారు.
ఆస్పత్రిలో చేరకుండానే కరోనా నుంచి కోలుకున్న వారిలో శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడుతున్నట్లు షెఫీల్డ్ యూనివర్సిటీ వైద్యులు గతంలోనే తేల్చారు. కొవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినా…వారిని ఊపిరితిత్తుల సమస్య వెంటాడే అవకాశమున్నందున కోవిడ్ బాధితులు కొన్ని మాసాలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..