AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పక్షవాతంతో కళ్లెదుటే భార్య పడుతున్న అవస్థలు.. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఏమీ చేయలేని నిస్సహాయత.. ఇంతలోనే విషాదం..

నరకయాతన అనుభవిస్తున్న భార్య ఒక వైపు.. తానూ ఏమీ చేయలేకపోతున్నానని బాధ మరోవైపు.. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ సంఘర్షణ.. చావే మార్గం అనే నిర్ణయం తీసుకునేలా చేసింది.

పక్షవాతంతో కళ్లెదుటే భార్య పడుతున్న అవస్థలు.. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఏమీ చేయలేని నిస్సహాయత.. ఇంతలోనే విషాదం..
Suicide
Balaraju Goud
|

Updated on: May 26, 2021 | 6:21 PM

Share

Man Suicide after kills Wife: పక్షవాతంతో భార్య మంచం పట్టింది… ఆమెకు సేవలు చేసిన భర్త అనుకోని ప్రమాదంతో తాను మంచానికి పరిమితమయ్యారు. నరకయాతన అనుభవిస్తున్న భార్య ఒక వైపు.. తానూ ఏమీ చేయలేకపోతున్నానని బాధ మరోవైపు.. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ సంఘర్షణ.. చావే మార్గం అనే నిర్ణయం తీసుకునేలా చేసింది. తాళి కట్టిన చేతితోనే భార్యకు ఉరివేసి తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హ‌ృదయవిదాకర సంఘటన కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి మండలంలోని చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన శంకర్ గారి సిద్దయ్య (65) వ్యవసాయ కుటుంబం. ఆయన భార్య బాలమణి నాలుగేళ్ల క్రితం పక్షవాతంతో మంచం పట్టింది. కుమారుడు రాజు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లడంతో సిద్దయ్య, ఆయన కోడలు బాలమణికి సేవలు చేసేవారు. కొద్ది రోజుల క్రితం సిద్దయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తర్వాత అనారోగ్యం పాలై కదలలేని స్థితికి చేరాడు.

కాగా, ఒకవైపు కళ్లెదుటే భార్య పడుతున్న అవస్థలు, మరోవైపు ఆమెకు ఏమీ చేయలేని నిస్సహాయత తన పరిస్థితి, కుమారుడికి కోడలికి భారంగా మారిందని బాధ ఇంకోవైపు, ఈ పరిణామాలతో కొన్నాళ్లుగా మానసికంగా కుంగిపోయారు ఆ దంపతులు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చావు అని నిర్ణయించుకున్నారు. భార్య బాలమణిని మంచం పక్కనే ఉన్న కిటికీకి చీరతో ఉరి వేసి చంపేశాడు. అనంతరం సిద్దయ్య ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయాడు.

అత్త కిటికీ వేలాడడాన్ని పక్కింట్లో ఉండే కోడలు గమనించి చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు తెరిచింది. అప్పటికే ఇద్దరు ప్రాణాలను వదలడంతో నిర్ఘాంతపోయారు. కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలె గల్ఫ్ నుంచి వచ్చిన రాజు.. కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపించాడు. ఇంతలోనే ఇలా జరిగిందని కొడుకు రాజు కన్నీటి పర్యంతమయ్యారు.

Read Also…  Keerthi Suresh: స్టార్ హీరోకు చెల్లెలుగా నటించనున్న అందాల భామ కీర్తిసురేష్.. ( వీడియో )