AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Effect on Mangoes: మామిడి పంటపై కరోనా ప్రభావం.. కొనేవారు లేక కుదేలవుతున్న మామిడి రైతులు..!

గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ ధాటికి కుదేలైన మామిడి రైతులు, ఈసారీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరోసారి తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు.

Corona Effect on Mangoes: మామిడి పంటపై కరోనా ప్రభావం.. కొనేవారు లేక కుదేలవుతున్న మామిడి రైతులు..!
Corona Effect On Mangoes Sales In Telugu States
Balaraju Goud
|

Updated on: May 26, 2021 | 6:02 PM

Share

Corona Effect on Mangoes Sales: గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ ధాటికి కుదేలైన మామిడి రైతులు, ఈసారీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరోసారి తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. వివిధ రకాల మామిడి వైరైటీలకు కేంద్రం అయిన సంగారెడ్డిలోని ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్‌లోని మామిడి పండ్లకు సైతం గిరాకీలేక మామిడి పళ్ల స్టాల్స్ వెలవెలబోతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4.31ల‌క్షల హెక్టార్లలో మామిడి పంట సాగవుతోంది. స‌గ‌టున 43.8 ట‌న్నుల మామిడి దిగుబ‌డి లభిస్తోంది. మొత్తం ఫ‌ల‌ సాగులో 68శాతం మామిడి పంట‌దే కావ‌డం విశేషం. అందులో తెలంగాణలోని వ‌రంగ‌ల్, న‌ల్గొండ‌, సంగారెడ్డి, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, విజ‌య‌న‌గ‌రం, విశాఖపట్నం, ఉభయ గోదావ‌రి జిల్లాల్లో మామిడి సాగు అధికంగా ఉంది.

దేశంలో మొత్తం 24% మామిడి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దిగుబ‌డి అవుతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ త‌ర్వాత ఉత్తర ప్రదేశ్, మ‌హారాష్ట్ర, బిహార్, క‌ర్ణాట‌క వంటి రాష్ట్రాల్లో మామిడి సాగు ఎక్కువ‌గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల‌ నుంచి ప్రధానంగా బంగిన‌ప‌ల్లి, తోతాపురి, సువ‌ర్ణరేఖ‌, నీలం, దషేరి, ర‌సాలు వంటి మామిడి ర‌కాలు ఎక్కువ‌గా పండుతుంటాయి.

సాధారణంగా ఏటా మార్చిలో మొద‌ల‌య్యే మామిడి సీజ‌న్ జూన్ వ‌ర‌కూ సాగుతుంది. అందులో ఏప్రిల్, మే నెల‌ల్లో మామిడి మార్కెట్ క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉండేది. కానీ ఈ సారి పరిస్థితి అలా లేదు. కరోనా కారణంగా గతేడాదిలాగే, ఈఏడాది కూడా మామిడి రైతులు గిరాకీ లేక నష్టపోతున్నారు.. గతంలో మామిడి పండ్లను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. ఈసారి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగు తుండటంతో మామిడి పండ్లను ఇతర రాష్ట్రాల మార్కెట్ కు తరలించే అవకాశం లేదు. దీంతో ఇక్కడా గిరాకీలు లేక, బయట రాష్ట్రాలకు ఎగుమతి చేయలేక మామిడి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కరోనా కారణంగా వరుసగా రెండు సీజన్లు నష్టాల పాలయ్యామని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

సుమారు 200 రకాల మామిడి పండ్లకు వేదిక అయిన సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రతీ ఏడాది ఈ పరిశోధన కేంద్రంలో పండిన మామిడి పంటను వేలం వేస్తారు. వేలం పాటలో నెగ్గిన వారు FRS ఆవరణలొనే స్టాల్స్ ఏర్పాటు చేసి మామిడి పండ్లు విక్రయిస్తారు. హిమాయత్, చక్కెర కేళి, బంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు, కలకండ్, దశేరి ఇలా ఎన్నో రకాల మామిడి పళ్లు ఇక్కడ విక్రయిస్తారు.. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకల నుండి కూడా ఇక్కడికి వచ్చి మామిడి పళ్ళను కొనుగోలు చేస్తారు. కానీ ఈసారి కూడా కరోనా కారణంగా విక్రయాలు జరగడం లేదు. లక్షల రూపాయలు పెట్టి వేలంలో కొనుగోలు చేశామని, విక్రయాలు మాత్రం జరగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు.

Read Also… Snakes Dancing: విశాఖ ఏజెన్సీలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. రెండు గంటల పాటు పాముల సయ్యాట..!

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!