Jagga Reddy : భారత జాతీయ పతాకం సాక్షిగా ప్లకార్డు పట్టుకొని ఇంట్లోనే నిరసనకు దిగిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి
Jagga Reddy protest : కేంద్ర ప్రభుత్వం రైతుకు నష్టం చేసే మూడు చట్టాలను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు...

Jagga Reddy protest : రైతుకు నష్టం చేసే మూడు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేసే విధంగా కేంద్ర ప్రభత్వం పై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని ఆయన కేసీఆర్ సర్కారుని కోరారు. మోదీ సర్కారు తెచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలంటూ జగ్గన్న ఇవాళ భారత జాతీయ పతాకం సాక్షిగా ప్లకార్డు ప్రదర్శిస్తూ ఇంట్లోనే తన నిరసన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పిన ఆయన, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో రైతులు ఆర్ధికంగా నష్టపోతారన్నారు. ఈ చట్టాలు అమలైతే రైతు పండించిన పంట స్వయంగా అమ్ముకునే పరిస్థితి ఉండదని జగ్గారెడ్డి చెప్పారు. “సంగారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతుల పక్షాన రైతు సంఘాలు పిలుపుకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ నా నిరసన వ్యక్తం చేస్తున్న..” అంటూ జగ్గారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Jagga Reddy For Farmers
Read also : Tirumala : శ్రీవారి అలిపిరి నడకమార్గం రెండు నెలలు పాటు మూసివేయనున్న తిరుమల తిరుపతి దేవస్థానం…!