Vijayawada: చైల్డ్ పోర్నోగ్రఫి కేసు.. విజయవాడలో యువ ఇంజనీర్ అరెస్ట్
ఆన్‌లైన్ చైల్డ్ పోర్న్ రాకెట్‌పై సీబీఐ ఉక్కుపాదం మోపుతున్నా.. ఆకృత్యాల వీడియోలతో పబ్బం గడుపుకునే వాళ్ల సంఖ్య తగ్గడం లేదు.
ఆన్‌లైన్ చైల్డ్ పోర్న్ రాకెట్‌పై సీబీఐ ఉక్కుపాదం మోపుతున్నా.. ఆకృత్యాల వీడియోలతో పబ్బం గడుపుకునే వాళ్ల సంఖ్య తగ్గడం లేదు. లెటెస్ట్‌గా విజయవాడలో ఓ యువ ఇంజనీర్‌ను కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. ఫకీర్‌గూడకు చెందిన 24ఏళ్ల సొహైల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చేశాడు. ఈ క్రమంలోనే ఓ రోజు చైల్డ్ పోర్న్ వీడియోస్ అమ్మబడును అనే యాడ్ చూశాడు. అమౌంట్ చెల్లించి వీడియోలను కొన్నాడు. ఆ తర్వాత దాన్నే బిజినెస్‌గా మార్చుకున్నాడు. నాలుగువేల చైల్డ్ పోర్న్ వీడియోలను అమ్మి భారీగా వెనకేశాడు. సోహైల్ వ్యవహారాన్ని గమనించిన చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ.. విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఫిర్యాదుతో సొహైల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. సెక్షన్ 62B, IT యాక్ట్, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. చిన్న పిల్లల నీలి చిత్రాలను ఎవరు కొన్నా, అమ్మినా, ఫార్వార్డ్ చేసినా కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.
చిన్నారుల అశ్లీల వీడియోల వ్యవహారంపై దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ఇంటర్‌నెట్‌తో పాటు సోషల్ మీడియాలో చైల్డ్ పోగ్నోగ్రఫీపై కన్నేసి ఉంచడానికి నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్(ఎన్‌సీఎంఈసీ) పని చేస్తోంది. చైల్డ్ సెక్స్‌వల్ అబ్యూజ్డ్ మెటీరియల్‌ను (సీఎస్‌ఏఎం) కనిపెట్టడానికి ఈ సంస్థ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్స్ వినియోగిస్తోంది. ఎవరైనా అతి చేస్తే ఈ సంస్థ వెంటనే సమాచారాన్ని సీబీఐకు, క్రైమ్ బ్రాంచ్‌కు ఇస్తుంది. అప్పుడు నేర నియంత్రణ సంస్థలు రంగంలోకి దిగి ఉన్నాదుల తాట తీస్తాయి.
Also Read: AP Weather: ఏపీకి వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరిక.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్