AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మరీ ఇంత వరెస్ట్‌గా తయారయ్యారు ఏంట్రా బాబు.. కోడిగుడ్ల దొంగతనం

కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. కాదేదీ దొంగతనానికి అనర్హం అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఇటీవల రేటు పెరిగిపోవడంతో టమాటాలు దొంగతనం జరగడం చూశాం.

Viral Video: మరీ ఇంత వరెస్ట్‌గా తయారయ్యారు ఏంట్రా బాబు.. కోడిగుడ్ల దొంగతనం
Eggs Theft
Ram Naramaneni
|

Updated on: Nov 28, 2021 | 5:32 PM

Share

కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. కాదేదీ దొంగతనానికి అనర్హం అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఇటీవల రేటు పెరిగిపోవడంతో టమాటాలు దొంగతనం జరగడం చూశాం. తాజాగా కోడిగుడ్ల వంతు వచ్చింది. అయితే ఇక్కడ కోడిగుడ్లు దొంగతనం చేసేందుకు దొంగ పెద్ద రిస్కే చేశాడు. ట్రావెల్‌లో ఉన్న ఓ వాహనం వెనక ఎక్కి గుడ్లను ఫాస్ట్‌ఫాస్ట్‌గా చేబుల్లో పెట్టుకున్నాడు. పని పూర్తిచేసి.. వాహనం వెళ్తుండగానే కిందకి దిగేశాడు. అయితే ఆ  రోడ్డు చాలా బిజీగా ఉంది. వచ్చిపోయే వాహనదారులు అందరూ అతడిని చూస్తేనే ఉన్నారు. కానీ అతడు మాత్రం అదేదో తన డ్యూటీ మాదిరిగా వాహనం ఎక్కి.. గుడ్లు నొక్కేసి.. కిందకు దూకేశాడు. కాగా సదరు కోడిగుడ్ల వాహనం వెనుక వెళ్తున్న కారులోని వ్యక్తి ఈ దొంగ బాగోతం మొత్తాన్ని వీడియో తీశారు. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. తమిళనాడులోని కడలూరు భారతి రోడ్డు సమీపంలో ఈ దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ వీడియోపై నెటిజన్లు భిన్న కామెంట్లు పెడుతున్నారు. కిందపడితే నువ్వు గుడ్డు మాదిరి చితికిపోతావ్ అని ఒకరు కామెంట్ పెట్టగా.. కక్కుర్తికి ఇతడు పర్యాయపదంలా ఉన్నాడని మరొకరు వ్యాఖ్యానించారు.

Also Read: ఏపీకి వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరిక.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

బ్రేకప్ తర్వాత తానిచ్చిన డబ్బు ఇచ్చేమన్న యువతి.. దీంతో మాజీ లవర్ షాక్ ఇచ్చాడు

వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు