AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ అభ్యర్థి ర‌ఘునంద‌న్ రావు బంధువు ఇంట్లో రూ.18 లక్షల నగదు

దుబ్బాక ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతుండటంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నోట్ల కట్టల పాములు బయటకు వస్తున్నాయి. తాజాగా సిద్దిపేట‌లో దుబ్బాక బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్ రావు బంధువు ఇంట్లో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బీజేపీ అభ్యర్థి ర‌ఘునంద‌న్ రావు బంధువు ఇంట్లో రూ.18 లక్షల నగదు
Balaraju Goud
|

Updated on: Oct 26, 2020 | 4:08 PM

Share

దుబ్బాక ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతుండటంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నోట్ల కట్టల పాములు బయటకు వస్తున్నాయి. తాజాగా సిద్దిపేట‌లో దుబ్బాక బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్ రావు బంధువు ఇంట్లో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో భాగంగా పోలీసులు, రెవెన్యూ అధికారులు సోమ‌వారం మ‌ధ్యాహ్నం ర‌ఘునంద‌న్ రావు బంధువు ఇంట్లో త‌నిఖీలు చేశారు. ఈ సోదాల్లో ఆ ఇంట్లో ఉన్న‌ రూ. 18.67 ల‌క్ష‌ల‌ను పోలీసులు, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు జ‌రిపిన బంధువు ఇంటికి ర‌ఘునంద‌న్ రావు చేరుకున్నారు. ఈ క్ర‌మంలో పోలీసులు, బీజేపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం అధికారులు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుబ్బాక ఉప ఎన్నిక‌కు న‌వంబ‌ర్ 3న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 10వ తేదీన ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు.

Follow Us