12 గంటల్లో చిన్నారి కిడ్నాప్ ఛేదించిన పోలీసులు

తూర్పు గోదావరి జిల్లాలో కలకలం సృష్టించిన నాలుగు నెలల చిన్నారి కిడ్నాప్ ను పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఛేదించారు. 12 గంటల వ్యవధిలోనే చిన్నారిని తల్లి ఒడికి చేర్చారు.

తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలో ఓ మహిళ చిత్తు కాగితాలు ఏరుకుంటూ కాలం వెల్లదీస్తుంది. ఈ క్రమంలో బీమేశ్వరాలయం సమీపంలోని తన నాలుగు నెలల చిన్నారితో కోనేరు వద్ద నిద్రించింది. సోమవారం తెల్లవారు జామున లేచి చూసేసరికి తన ఒడిలోని చిన్నారి కనిపించకుండా పోయింది. దీంతో ఖంగారుపడ్డ మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు చేసింది. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. కేవలం 12 గంటల్లోనే కిడ్నాప్ ను చేధించి నిందితుల్ని పట్టుకున్నట్లు జిల్లా ఏస్పీ నయీం అస్మి తెలిపారు. అయితే వారం రోజుల క్రితం గుర్తు తెలియని మహిళ వచ్చి తనకు చిన్నారి అమ్మాల్సింది పాప మహిళను కోరినట్లు పోలీసులకు తెలిపింది. ఈ క్లూ అధారంగా దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. క్షేమంగా తన పాప చేరడం పట్ల ఆ తల్లి సంతోషాన్ని వ్యక్తం చేసింది.

Click on your DTH Provider to Add TV9 Telugu