Pregnant Woman Dies: ఆసుపత్రుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి.. అంత్యక్రియలకు నిరాకరణ.. అధికారుల ఆదేశాలతో..
Pregnant Woman Dies: కార్పొరేట్ ఆసుపత్రల నిర్లక్ష్యం ఓ నిండు గర్భిణీని బలికొంది. కోవిడ్ కారణంగా ఆసుపత్రులో సమయానికి చేర్చకపోవడంతో కడుపులో బిడ్డతో సహా తల్లి మరణించింది. ఇక కడుపులో నుంచి బిడ్డను...
Pregnant Woman Dies: కార్పొరేట్ ఆసుపత్రల నిర్లక్ష్యం ఓ నిండు గర్భిణీని బలికొంది. కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో సమయానికి చేర్చకపోవడంతో కడుపులో బిడ్డతో సహా తల్లి మరణించింది. ఇక కడుపులో నుంచి బిడ్డను వేరు చేస్తే తప్ప అంత్యక్రియలు నిర్వహించమని స్మశానవాటిక నిర్వాహకులు చెప్పారు. ఈ విషాధ సంఘటన శనివారం హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని మల్లాపూర్‌కు చెందిన పావని అనే మహిళ 8 నెలల గర్భంతో ఉంది. అయితే రెగ్యులర్ చెకప్‌లో భాగంగా ఓ ఆసుపత్రికి వెళ్లగా.. అక్కడ కడుపులో ఉమ్మనీరు తక్కువుందని సెలైన్ ఎక్కించి పంపించేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఆయాసం మొదలైంది. వెంటనే తల్లి అదే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కోవిడ్ అయి ఉండొచ్చన్న అనుమానంతో అక్కడ చికిత్స చేయమని చెప్పారు. ట్రీట్‌మెంట్ కోసం ఎప్పుడూ ఇక్కడికే వస్తామని చెప్పినా.. ఆసుపత్రి సిబ్బంది చేర్చుకోలేరు. దీంతో అంబులెన్సులో మరో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు.. అక్కడ అదే పరిస్థితి. దీంతో ఎల్‌బీనగర్‌లోని మరో ఆసుపత్రికి వెళ్లే సరికి.. పరీక్షించిన వైద్యులు తల్లి పరిస్థితి కష్టంగా ఉంది.. గాంధీకి గానీ, కోఠి ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్తే కడుపులో బిడ్డయినా బతుకుతుందని పంపించేశారు. కోఠి ప్రసూతి ఆసుపత్రికి తరలిస్తుండగానే పావని కన్నుమూసింది. ఇక చనిపోయిన పావని అంత్యక్రియలు చేసేందుకు స్మశాన నిర్వహకులు ముందుకు రాలేదు. కడుపులో నుంచి బిడ్డను వేరు చేస్తే తప్ప దహన సంస్కారం చేయమని తేల్చి చెప్పారు. అప్పటికే పావనిని, ఆమె కడుపులో చిన్నారిని కోల్పోయన్న బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు స్మశాన వాటిక సిబ్బంది మాటలు మరింత బాధించాయి. చివరికి ఈ విషయం తెలుసుకున్న అధికారులు మల్లాపూర్‌లోని వైకుంఠధామం నిర్వాహకులతో మాట్లాడి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హృదయవిదారకర ఘటనపై మేడ్చల్ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ శ్వేతా మహంతి విచారణకు ఆదేశించారు. దీంతో డీఎంహెచ్‌వో మల్లిఖార్జున్ మృతురాలు పావని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు.
SBI Employee Murder: రోడ్డుపై కారు పార్కింగ్ విషయంలో గొడవ.. ఒకరిని కత్తితో పొడిచి చంపిన దుండగులు..!
ప్రాణం తీసిన వాట్సప్ స్టేటస్..! పద్నాలుగేళ్ల బాలిక ఆత్మహత్య.. వివరాలు ఇలా ఉన్నాయి..