AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Sniffs Murders: ఈ జాగిలం చాలా ఫాస్ట్.. ఆరుగురు నరహంతకులను అర్ధ గంటలో పట్టించిన పోలీస్‌ శునకం.

Dog Sniffs Murders: పోలీసు జాగిలాలు మెరుపు వేగం, క్రమ శిక్షణకు మారుపేరు. శిక్షణా కాలంలో పోలీసులు ఇచ్చే తర్ఫీదు అలా ఉంటుంది మరీ.. అందుకే శిక్షణ పూర్తి అయిన వెంటనే...

Dog Sniffs Murders: ఈ జాగిలం చాలా ఫాస్ట్.. ఆరుగురు నరహంతకులను అర్ధ గంటలో పట్టించిన పోలీస్‌ శునకం.
Police Dog
Narender Vaitla
|

Updated on: Aug 19, 2021 | 6:13 PM

Share

Dog Sniffs Murders: పోలీసు జాగిలాలు మెరుపు వేగం, క్రమ శిక్షణకు మారుపేరు. శిక్షణా కాలంలో పోలీసులు ఇచ్చే తర్ఫీదు అలా ఉంటుంది మరీ.. అందుకే శిక్షణ పూర్తి అయిన వెంటనే అవి బరిలోకి దిగితే కరుడుగట్టిన నేరగాళ్లు సైతం తోక ముడుచుకోవాల్సిందే. తాజాగా గుజరాత్‌లో జరిగిన ఓ సంఘటన పోలీసు జాగిలాల పనితీరు ఎంత గొప్పగా ఉంటుందో ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని వడోదర పట్టణానికి సమీపంలో ఉన్న దెతాన్‌ గ్రామ సమీపంలో ఆగస్టు 16న ఓ మహిళ దారుణ హ్యతకు గురైంది. పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళుతోన్న సమయంలో సదరు మహిళ రైల్వే ట్రాక్‌ దాటుతున్న విషయాన్ని గమనించిన కొందరు కామాంధులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఎక్కడ ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేస్తుందోనని దారుణంగా హత్య చేశారు. శవాన్ని ముళ్ల పొదల్లో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఎంత రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో సదరు మహిళా కుటుంబీకులు ఆమెను వెతుకుతూ వెళ్లారు. తీరా రాత్రి 9 గంటల సమయంలో ఆమె శవం ఆచూకీ కుటుంబసభ్యులకు లభ్యమైంది. దీంతో మహిళ కుటుంబ సభ్యులు గురువారం తెల్లవారు జామున కర్జాన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు విచారణ ప్రారంభించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్‌ నిపుణులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.

వీరితో పాటు పోలీసులు ‘జావా’ అనే పోలీస్‌ జాగిలాన్ని తీసుకొచ్చారు. సంఘటన స్థలంలో వాసన పసిగట్టిన జాగిలం ఒక్క సారిగా రైల్వే ట్రాక్‌ వైపు పరిగెత్తింది. కేవలం ముప్పై అంటే ముప్పై నిమిషాలలోపే.. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆగిపోయింది. ఇందులో భాగంగా శునకం 22 ఏళ్ల లాల్‌ బహదూర్‌ గిరిజరమ్‌ అనే వ్యక్తి దగ్గరకు వెళ్లి అదే పనిగా మోరిగింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు సదరు వ్యక్తిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో అతను మరో ఐదుగురి పేర్లు చెప్పడంతో అందరినీ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి ప్రశ్నించడంతో నిజం బయట పెట్టారు. ఆ ఆరుగురు వ్యక్తులపై గతంలోనూ పలు క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. వారు గత పది రోజులుగా రైల్వే ట్రాక్‌ పనులు చేస్తూ అక్కడే నివసిస్తున్నారని.. ఈ క్రమంలోనే ఆగస్టు 16న అటుగా వెళుతోన్న మహిళపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

Police Dog Jawa

జాగిలం వేగంగా స్పందించడంతోనే..

ఆపరేషన్‌లో పాల్గొన్న 18 నెలల జావా అనే పోలీసు జాగిలం అత్యంత వేగంగా స్పందించడంతోనే నేరస్థులు దొరికారు. కేవలం 30 నిమిషాల్లోపే శునకం నిందితులను గుర్తించడం విశేషం. ఈ క్రమంలో హత్య జరిగిన ప్రదేశం నుంచి జాగిలం ఏకంగా 2 కిలో మీటర్లు పరిగెత్తింది. ఈ క్రమంలో పెద్ద పెద్ద ముళ్ల పొదలలను దాటుకుంటూ వెళ్లి మరీ నిందితులను గుర్తించింది. ఈ విషయమై వదోదర రూరల్‌ పోలీస్‌ అధికారి సుధీర్‌ దేశాయ్‌ మాట్లాడుతూ.. గతంలోనూ నేర పరిశోధనల్లో జాగిలాల సహాయం తీసుకున్నామని, కానీ ఈసారి జావా చాలా త్వరగా నిందుతులను గుర్తించిందని తెలిపారు. ఇక ఈ జాగిలానికి శిక్షణ ఇస్తోన్న హెడ్‌ కానిస్టేబుల్‌ హరీష్‌ మోహానియా జాగిలంపై ప్రశసంలు కురిపించారు. గతేడాది నుంచి ఈ శునకానికి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చిన హరీష్‌.. జావా చాలా తెలివైందని, దేనినైనా వేగంగా నేర్చుకుంటుందని చెప్పుకొచ్చారు.

Also Read: AP Corona Cases: ఏపీలో మరోసారి కలవరం.. పెరిగిన పాజిటివ్ కేసులు.. వైరస్ బారినపడి 10మంది మృతి

Guntur: పులిచింతల పునరావాస కేంద్రంలో దారుణం.. మైనర్ బాలికపై సామూహిక ఆత్యాచారం..

Fake Currency: జూబ్లీహిల్స్‌లో ఫేక్ కరెన్సీ తయారీ ముఠా అరెస్ట్.. ఈ నకిలీ దందా లోతుల్లోకి వెళితే..