AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Crime News: పోలీసు పేరుతో దోపిడీకి పాల్పడిన దొంగ అరెస్టు.. మాటు వేసి ప‌ట్టిన పోలీసులు

పోలీస్ అని చెప్పి దోపిడీకి పాల్పడిన నిందితుడిని వర్ధన్నపేట పోలీసు అరెస్టు చేసారు. నిందితుడి నుండి సుమారు 3లక్షల50 వేల రూపాయల విలువగల బంగారు ఆభరణాలతో పాటు...

Telangana Crime News:  పోలీసు పేరుతో దోపిడీకి పాల్పడిన దొంగ అరెస్టు.. మాటు వేసి ప‌ట్టిన పోలీసులు
Crime In The Name Of Police
Ram Naramaneni
|

Updated on: May 30, 2021 | 5:46 PM

Share

పోలీస్ అని చెప్పి దోపిడీకి పాల్పడిన నిందితుడిని వర్ధన్నపేట పోలీసు అరెస్టు చేసారు. నిందితుడి నుండి సుమారు 3లక్షల50 వేల రూపాయల విలువగల బంగారు ఆభరణాలతో పాటు ఒక ద్విచక్ర వాహనం, నాలుగు సెలఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ.. నల్లగొండ జిల్లా, దామచర్ల మండలం, గణేష్ పహాడ్ గ్రామానికి చెందిన నిందితుడు బానోత్ వెంకటేశ్ 2018 సంవత్సరంలో బార్డర్ సెక్యూరీటి ఫోర్స్‌కు ఎంపికై అస్సాం దిస్సూర్ ప్రాంతంలో మూడు నెలల శిక్షణ అనంతరం శిక్షణ కఠినంగా ఉండ‌టంతో బి.ఎస్.ఎఫ్ శిక్షణా కేంద్రం నుండి తిరిగి వచ్చాడు. అనంతరం నిందితుడు కానిస్టేబుళ్ళ ఉద్యోగ నియామకం కోసం నిర్వహించే పోటీ పరీక్షల కోసం 2019వ సంవత్సరంలో దిల్‌షుఖ్ నగర్ ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్ లో శిక్షణ పొందుతూ అదే ప్రాంతంలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న క్ర‌మంలో.. అక్క‌డే ఫ్యాన్సీ షాపులో విధులు నిర్వహిస్తున్న యువతి పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. ఇదే సమయంలో నిందితుడు ఎల్.బి నగర్ ప్రాంతంలో ద్విచ‌క్ర‌ వాహనాలను అద్దెకిచ్చే ఓగో సంస్థ నుంచి ఓ టూ వీల‌ర్ అద్దెకు తీసుకోని ఆ వాహనాన్ని తన సొంత‌ అవసరాలకు వాడుకోనేందుకు దానికి వున్న జి.పి.ఎస్ పరికారాన్ని తొలిగించాడు.

లాకౌ డౌన్ కారణంతో స్వగ్రామానికి తిరిగివచ్చిన నిందితుడు తాను మిర్యాలగూడలో చదువుకున్న కాలేజీలో కబడ్డీ క్రీడలో ఉచిత శిక్షణ ఇస్తుండంతో మిర్యాలగూడలో ఓ ఇంటిని అద్దెకు తీసుకోని రోజూ కబడ్డీ క్రీడలో శిక్షణ పోందేవాడు. ఈ నెల 21తేదిన దిల్ షుఖ్ నగర్ లో ప్రేమించిన యువతి తాను నెక్కొండ‌లోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాలి అని తెలపడంతో నిందితుడు మిర్యాలగూడ నుంచి హైదరాబాదు బైక్‌పై వచ్చి అదే రోజు రాత్రి సదరు యువతి ఇంటిలో నిద్రించి మరుసటి రోజు 22వ తేదిన తెల్లవారుజామున తాను బి.ఎస్.ఎఫ్ శిక్షణ సమయంలో వినియోగించిన జంగిల్ డ్రెస్ కు సంబంధించిన ఫ్యాంట్ ను ధరించి తన ప్రియురాలితో కలిసి బయలుదేరి ఉదయం సమయంలో నిందితుడు ఆమెను నెక్కొండ‌లోని తన ఇంటి వద్ద దింపి తిరుగు ప్రయాణమయ్యాడు. నిందితుడు మిర్యాలగూడకు తిరిగి వెళ్ళేందుకుగాను చింతి నెక్కొండ‌, ఉప్పరపల్లి క్రాస్, తొర్రూర్ మీదుగా ప్రయాణం అయ్యాడు. ఇదే సమయంలో నిందితుడు ఒక కర్రను తన వెంట తెచ్చుకున్నాడు. నిందితుడు తోర్రూరు వైపు ప్రయాణిస్తుండగా రాయపర్తి మండలం జయరాం తండా క్రాస్ రోడ్డు వద్ద ఒక వ్యక్తి బ్యాగును భుజానికి వేసుకోని రోడ్డుపై నిలుచోని వుండగా సదరు వ్యక్తి వద్దకు వెళ్ళి తాను తోర్రూర్ పోలీస్ గా పరిచయం చేసుకోని లాక్ డౌన్ వేళ ఇక్కడ ఏంచేస్తున్నావని అడగడంతో సదరు వ్యక్తి ఖంగుతిని తనను హరిశంకర్ గా పరిచయం చేసుకోని తాను వరంగల్ నుండి బంగారు వుస్తువులు తీసుకోని తోర్రూర్ లోని బంగారు షాపు యజమానికి అందజేసేందుకుగా వెళ్ళుతున్నాన‌ని తన బ్యాగులోని బంగారు ఆభ‌ర‌ణాల‌ను చూపించాడు. దీనితో సదరు వ్యక్తిని బెదిరించి.. బంగారు చోరీ చేసి వాటిని అమ్మగా వచ్చిన సొమ్ముతో తన ప్రియురాలితో కల్సి జల్సా చేయవచ్చనే అలోచనతో నిందితుడు భాధితుడు హరిశంకర్ ను బెదిరించి అతని వద్దనున్న బంగారు ఆభరణాలతో పాటు, సెల్ ఫోన్ ను దోపిడీ చేసి బైక్‌పై పారిపోయాడు. కొద్ది దూరం ప్రయాణించిన అనంతరం నిందితుడు భాధితుడి సెల్ ఫోన్ ను ఎస్.ఆర్.ఎస్.పి కాలువలో పడవేసి, దోపిడి చేసిన బంగారు ఆభ‌ర‌ణాల‌లోని ఒక ఉంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తికి 11వేలకు అమ్మివేశాడు.

బాధితుడు హరిశంకర్ వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పట్టుకోనేందుకు పోలీసు ఉన్న‌తాధికారులు ప్ర‌త్యేక టీమ్స్‌ను రంగంలోకి దించారు. అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని పోలీసులు నిందితుడి కదలికలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు.

Also Read: సండే క‌రోనా వ్యాప్తికి సెల‌వు లేదండి..! ఆదివారం చేప‌ల మార్కెట్లు, మాంసం దుకాణాల వ‌ద్ద ఏందీ లొల్లి

 రహస్యంగా బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ వివాహం.. చివరి నిమిషంలో అతిథులకు ఆహ్వానం!