AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సచివాలయానికి బాంబు బెదిరింపు.. ఉరుకులు… పరుగులు పెట్టిన మహా పోలీసులు

Bomb Threat Call: మహారాష్ట్ర సచివాలయానికి బాంబు బెదిరింపు కాల్‌ రావడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. వెంటనే అలర్టైన పోలీసులు.. అక్కడికి చేరుకుని తనిఖీలు మొదలు పెట్టారు. పరిసరాలను అదుపులోకి..

సచివాలయానికి బాంబు బెదిరింపు.. ఉరుకులు... పరుగులు పెట్టిన మహా పోలీసులు
Bomb Threat Call At Maharas
Sanjay Kasula
|

Updated on: May 30, 2021 | 6:22 PM

Share

మహారాష్ట్ర సచివాలయానికి బాంబు బెదిరింపు కాల్‌ రావడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. వెంటనే అలర్టైన పోలీసులు.. అక్కడికి చేరుకుని తనిఖీలు మొదలు పెట్టారు. పరిసరాలను అదుపులోకి తీసుకుని బాంబ్ స్క్వాడ్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో అధికారులు చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా తనిఖీల ద్వారా నిర్వహించారు.

బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో హుటాహుటిన బాంబు నిర్వీర్య దళం అక్కడికి చేరుకుంది. మహారాష్ట్ర విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఈ వివరాలను వెల్లడించాడు. మొత్తం  క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే చివరికి ఎలాంటి బాంబు లేదని తెలుసుకున్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఫేక్ కాల్ అని ముంబై పోలీసులు తెలిపారు. అయితే ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకునే పనిలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సచివాలయం వద్ద వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇవి కూడా చదవండి : సన్నిలియోన్ ఇంటికి పక్కనే ఇల్లు కొన్న మెగాస్టార్..తక్షణమే రిజిస్ట్రేషన్ కావాలంటూ పట్టుపట్టిన హీరో :Mumbai Video.

‘ఇది మోదీ సర్కార్ మరో మాస్టర్ స్ట్రోక్’…., పిల్లలను ఆదుకుంటామన్న పీఎం కేర్స్ ఫండ్ పై ప్రశాంత్ కిషోర్ సెటైర్ ..హామీలుగా మిగిలిపోరాదని చురక