Crime News: సోదరుడి ఘాతుకం.. వావివరసలు మరచి అత్యాచారం.. జీవిత ఖైదు విధించిన కోర్టు

రోజు రోజుకు అమ్మాయిలపై వేధింపులు పెరుగుతున్నాయి. దేశంలో ఏదో ఓ చోట మహిళలు లైంగిక దాడికి గురువుతూనే ఉన్నారు...

Crime News: సోదరుడి ఘాతుకం.. వావివరసలు మరచి అత్యాచారం.. జీవిత ఖైదు విధించిన కోర్టు
Rape
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Sep 30, 2021 | 10:34 AM

రోజు రోజుకు అమ్మాయిలపై వేధింపులు పెరుగుతున్నాయి. దేశంలో ఏదో ఓ చోట మహిళలు లైంగిక దాడికి గురువుతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మార్పు రావడం లేదు. మద్యం మత్తులో, డ్రగ్స్ మత్తులో అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వావి వరసలు మరిచి అక్క, చెల్లెలిపైనే వేధింపులకు ఒడిగడుతున్నారు. సోదరుడే అత్యాచారం చేశాడని చెబితే.. తండ్రి అతడిపై చర్యలు తీసుకోకుండా ఆ అమ్మాయినే తప్పుబట్టాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది.

జైపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి పెళ్లైంది. వారికి కుమారుడు జన్మించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత భార్య చనిపోయింది. పిల్లాడి ఆలనపాలన కోసం అతుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ అమ్మాయి పుట్టింది. పాపు పుట్టున కొన్ని ఏళ్ల తర్వాత రెండో భార్య కూడా మరణించింది. ఆ అర్వాత అతుడు మరో పెళ్లి చేసుకోలేదు. రెండో భార్య చనిపోయినప్పటి నుంచి మొదటి భార్య కొడుకు ఆ అమ్మాయిపై వేధింపులకు పాల్పడుతున్నాడు. రోజు అత్యాచారం చేస్తునే ఉన్నాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు కూడా. అతడి వేధింపులను అనుభవిస్తూ నరకాన్ని చూసింది ఆమె. చివరికి సోదరుడి వేధింపులు భరించలేక విషయాన్ని తండ్రి చెబుదామని అనుకుంది. ఓ రోజు తండ్రికి జరిగిన దారుణం గురించి చెప్పింది. సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాడనుకుని ఆ అమ్మాయి భావించింది. కానీ అక్కడే ఆమెకు అనుకోని సంఘటన ఎదురైంది. తండ్రి అమ్మాయిని కొట్టడమే కాకుండా ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. తండ్రి చేసిన పనికి కూతురు ఖంగుతింది.

చేసేదేమి లేక వాళ్ల మేనమామ ఇంటికి వెళ్లిపోయింది. జరిగిందంతా మేనమామకు చెప్పింది. అతడి సహాయంతో 2017, అక్టోబర్ 27న ఫాగీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ఆ యువతికి 16ఏళ్లు. ఈ కేసు బుధవారం కోర్టులో విచారణకు వచ్చింది. వావివరసలు మరిచి చెల్లెలిపైనే అత్యాచారం చేసిన నిందితుడికి కోర్టు కఠిన శిక్షను విధించింది. జీవితాంతం జైలులోనే ఉండాలని తీర్పునిచ్చింది. అలాగే మూడు లక్షల రూపాయలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సందీప్ కుమార్ తీర్పును వెల్లడించారు. ఈ తీర్పుపై మహిళా సంఘాలు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి వాడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

Read Also.. Crime News: అక్రమ సంబంధం పెట్టుకున్నారని.. వివస్త్రలను చేసి నగ్నంగా ఊరేగించారు.. ఆ తర్వాత ఏమైందంటే..?