ప్రియుడి మోసం.. సూసైడ్ చేసుకున్న టాలీవుడ్ యువనటి.. కుళ్లిన స్థితిలో మృతదేహం…

ప్రియుడు మోసం చేయడంతో.. టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‏లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్

ప్రియుడి మోసం.. సూసైడ్ చేసుకున్న టాలీవుడ్ యువనటి.. కుళ్లిన స్థితిలో మృతదేహం...
Junior Artist
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 30, 2021 | 10:32 AM

ప్రియుడు మోసం చేయడంతో.. టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‏లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కుత్బల్లాపూర్ గాజుల రామారం ప్రాంతానికి చెందిన కావలి అనురాధ (22) మూడు నెలలుగా కిరణ్ అనే జూనియర్ ఆర్టిస్ట్‏తో కలిసి ఫిలింనగర్‏లోని జ్ఞానిజైల్ సింగ్ నగర్‎లో ఓ ఇంటి రెండో అంతస్తులోని గదిలో నివసిస్తుంది. ఆమె గది నుంచి దుర్వాసన వస్తుండడంతో ఆమె ఇంటి కింద గదిలో ఉండే కొందరు యువకులు ఆ విషయాన్ని్ మంగళవారం రాత్రి ఇంటి యజమానికి తెలియజేశారు. దీంతో సదరు ఇంటి ఓనర్ అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఇంటికి వచ్చి.. దుర్వాసన వస్తున్న గదిని తెరచి చూడగా.. కుళ్లిన స్థితిలో అనురాధ మృతదేహం కనిపించింది. దీంతో ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అనురాధ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్‏తో తమ కూతురు ఆరేళ్లుగా ప్రేమలో ఉందని.. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారని… అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో అతనితో కలిసి నివసిస్తోందని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే అనురాధకు తెలియకుండా.. కిరణ్ ఇటీవల వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడని.. ఇదే విషయంపై అతడిని నిలదీయడంతో మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదని చెబుతున్నారు. ఇక ప్రియుడు చేసిన మోసాన్ని తట్టుకోలేక అనురాధ ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి సోదరి తెలిపింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో బంజారా హిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు కిరణ్ కోసం గాలింపు చేపట్టారు.

Also Read: Nani: నాని డేరింగ్ డెసిషన్.. ఆ స్టార్ హీరో సినిమాలో మరోసారి నెగిటివ్ షెడ్‏లో న్యాచురల్ స్టార్..

Maa Elections 2021: ప్రచారంలోనూ పోటా పోటీ.. ప్రకాష్ రాజ్ ట్వీట్‏కు బండ్ల గణేష్

Mohan Babu: ఆరు నెలలు పనిచేయించుకుని 50 రూపాయాలు జీతం ఇచ్చారు.. మోహన్ బాబు ఆసక్తికర విషయాలు..