Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chittoor News: తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన కేటుగాడు.. కంపెనీలో పనిచేస్తూ రూ. 5 కోట్లు స్వాహా..

Chittoor News: సొంత మేనమామ కంపెనీలో రూ.5 కోట్ల నిధులు(Financial Fraud) స్వాహా చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై సీసీబీ పోలీసులు(Chennai police).. చిత్తూరు జిల్లా పుంగనూరుకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Chittoor News: తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన కేటుగాడు.. కంపెనీలో పనిచేస్తూ రూ. 5 కోట్లు స్వాహా..
Chittoor man Arrested
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 09, 2022 | 2:02 PM

Chittoor News: సొంత మేనమామ కంపెనీలో రూ.5 కోట్ల నిధులు(Financial Fraud) స్వాహా చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై సీసీబీ పోలీసులు(Chennai police).. చిత్తూరు జిల్లా పుంగనూరుకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకోసం వారు స్థానిక పోలీసుల సహకారం పొందారు. మేనమామ కంపెనీలో 5 ఏళ్లుగా వివిధ హోదాల్లో పనిచేసిన నిందితుడు.. రూ.5 కోట్లు స్వాహా చేశాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చెన్నై సాలిగ్రామ్‌లోనున్న బుల్ డైయర్స్ ఇంట్రగ్రేటెడ్ సొల్యూషన్స్ అనే సంస్థ ఉంది. ఈ కంపెనీలో నిందితుడు శ్రావణ్ కుమార్ రెడ్డి (29) పనిచేశాడు. ఫైనాన్సియల్ మేనేజర్‌గా విధులు నిర్వహించి.. కంపెనీ నుంచి బయటకు వచ్చేశాడు. శ్రావణ్ కుమార్ రెడ్డి కంపెనీ వదిలి పెట్టిన నాటి నుంచి.. సొంతూరు పరిసరాల్లో చాలా ఆస్తులు కొన్నాడు. విలాసవంతమైన గెస్ట్ హౌసులు, కార్లు, కోళ్ల ఫారాలు ఇలా ఒకటేమిటి ఆర్థికంగా బాగా పుంజుకున్నాడు.

ఈ నేపథ్యంలో తమ కంపెనీలో శ్రావణ్ కుమార్ రెడ్డి రూ.5 కోట్లు నిధులు దుర్వినియోగం చేశాడంటూ.. అతని మేనమామ, కంపెనీ యజమాని శ్రీనాథ్ రెడ్డి చెన్నైలోని సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లెయింట్ తో రంగంలోకి దిగిన పోలీసులకు దర్యాప్తులో కీలక ఆధారాలు దొరికాయి. కంపెనీ అకౌంట్ల నుంచి కేటుగాడు వివిధ కుటుంబ సభ్యుల ఖాతాలోకి డబ్బు మళ్లించినట్లు తేలింది. ఇక ఆలస్యం చేయకుండా నిందితుడిని చిత్తూరు జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి..

MEIL: ONGCకి అత్యాధునిక ల్యాండ్ రిగ్ డెలివరీ చేసిన మేఘా సంస్థ.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ..

Facts about Tears: బాధ కలిగినపుడు కన్నీరు కాటుక కళ్లను దాటనివ్వండి! సైన్స్‌ ఏం చెబుతోందంటే..