Call Money: ఆళ్లగడ్డలో కాల్ మనీ కలకలం.. నిద్రమాత్రలు మింగి వ్యక్తి ఆత్మహత్య..
Allagadda Call Money Case: కర్నూల్ జిల్లాలో కాల్‌మనీ వ్యవహారం కలకలం సృష్టించింది. రాష్ట్రంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికి కాల్ మనీ ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా..
Allagadda Call Money Case: కర్నూల్ జిల్లాలో కాల్‌మనీ వ్యవహారం కలకలం సృష్టించింది. రాష్ట్రంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికి కాల్ మనీ ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా ఈ కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన దత్తయ్య ఆచారి అనే వ్యక్తి ఆత్మహత్య శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆచారి గత కొంతకాలం క్రితం చంద్రారెడ్డి అనే వ్యక్తి దగ్గర అప్పు చేశాడు. దీనికి సంబంధించి స్థలాన్ని సైతం తాకట్టుపెట్టాడు. ఈ క్రమంలో గడువు తీరడంతో అప్పు చెల్లించాలని చంద్రారెడ్డి.. ఆచారిని తరచూ వేధిస్తున్నాడు.
మొత్తం వడ్డీతో కలిపి అప్పు లక్షా డెబ్బై వేలు కట్టవలసి ఉంది. ఈ క్రమంలో ఆచారి చంద్రారెడ్డి దగ్గరకు వెళ్లి సమయం కావాలని అడిగాడు. అయితే.. సమయం పూర్తయ్యిందని.. ఇంకా కాగితాలు వెనక్కి రావంటూ చంద్రారెడ్డి పేర్కొనడంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన ఆచారి ఆత్మహత్య చేసుకున్నాడు. అధిక మోతాదులు ఆచారి నిద్రమాత్రలు మింగాడని దీంతో చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ మేరకు బాధితులు తమకు న్యాయం చెయాలని పోలీసులను ఆశ్రయించారు. ఆచారి భార్య నాగలక్ష్మమ్మ, కుమారుడు యుగంధర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: