Libya boat accident: మరోసారి మధ్యధరా సముద్రంలో పడవ మునక.. లిబియా తీరంలో 130 మంది శరణార్ధుల మృతి

మధ్యధరా సముద్ర తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. యూరప్ చేరుకోవటం కోసం బోటులో ప్రయాణిస్తున్న శరణార్థులు మరోసారి మధ్యధరా సముద్రంలో మునిగిపోయి చనిపోయారని ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ తెలిపింది.

Libya boat accident: మరోసారి మధ్యధరా సముద్రంలో పడవ మునక.. లిబియా తీరంలో 130 మంది శరణార్ధుల మృతి
Libya Boat Accident
Follow us

|

Updated on: Apr 24, 2021 | 2:34 PM

Libya boat accident: మధ్యధరా సముద్ర తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. యూరప్ చేరుకోవటం కోసం బోటులో ప్రయాణిస్తున్న శరణార్థులు మరోసారి మధ్యధరా సముద్రంలో మునిగిపోయి చనిపోయారని ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ తెలిపింది. శరణార్ధులు ప్రయాణిస్తున్న పడవ ఆఫ్రికా లిబియా తీరంలో మునిగిపోయింది. ఈ ఘటనలో దాదాపు 130 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో గల్లంతైన వారంతా చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. దాదాపు 236 మందితో కూడిన ఓ పడవ లిబియా తీరంలో శనివారం మునిగిపోయినట్లు ఐక్యరాజ్యసమితి వలసదారుల సంక్షేమ విభాగం వెల్లడించింది.

శరణార్ధులు వెళ్తున్న ఓ బోటు లిబియా తీరంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో యూరప్ కు వెళుతున్న 130 మంది అక్రమ వలస దారులు మృతి చెందారు. పేదరికం, అంతరయుద్దం భరించలేక ఆఫ్రికా నుంచి చాలా మంది మెరుగైన జీవితం కోసం.. మధ్యధరా సముద్రం గుండా యూరప్ లోకి అక్రమంగా చొరబడుతున్నారు.ఇందుకోసం రబ్బరు బొట్లను ఉపయోగిస్తారు. వీటిలో పరిమితికి మించి వలసదారులను తీసుకెళ్తుంటారు. అలా 130 మందితో బయలుదేరిన ఓ బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 130 మంది మృతి చెందారు. అయితే ప్రత్యేక పడవలను అక్కడికి పంపి వాటిలోని 106 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఓ మహిళ, కొందరు పిల్లలు ఉన్నట్లు ఐఓఎం అధికారులు తెలిపారు. వీరిని చికిత్స కోసం సమీప ద్వీపంలోని ఆస్పత్రికి తరలించామని తెలియజేశారు.

మరికొన్ని ఘటనలు…

ప్రతి ఏటా వేలాది మంది శరణార్థులు యూరప్ చేరుకోవటం కోసం మధ్యధరా సముద్రాన్ని దాటటానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాణాంతక ప్రయాణం ప్రారంభించటానికి లిబియా ఒక కీలక కేంద్రంగా మారింది. ఈ ప్రయాణంలో పాతబడిపోయిన పడవల్లో, ప్రయాణికులను పెద్ద సంఖ్యలో ఇరికించి పంపిస్తున్నారు. ఫలితంగా చాలా మంది ప్రాణాలు జలసమాధి అవుతున్నాయి. ఈ ప్రయాణంలో పాతబడిపోయిన పడవల్లో, ప్రయాణికులను పెద్ద సంఖ్యలో ఇరికించి పంపిస్తున్నారు. ఫలితంగా చాలా మంది చనిపోయారు.

తరచూ మధ్యధరా సముద్రంలో ఇలాంటి చోటుచేసుకుంటున్నాయి. ఒక్క 2016లోనే మధ్యధరా సముద్రంలో జరిగిన పడవ ప్రమాదాల్లో 5,600 మంది శరణార్థులు మృతిచెందినట్టు ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ నివేదిక వెల్లడించింది. అయితే 2017 మధ్య నుంచి శరణార్థుల ప్రయాణాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ శరణార్థులు రాకుండా చూడటానికి, ఒకవేళ సముద్రంలో కనిపించినట్లయితే లిబియాకు తిప్పిపంపించేలా చేయటానికి లిబియా దళాలను ఇటలీ ఉపయోగించుకుంది. ఈ విధానాన్ని మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా ఖండించాయి.

2019లో మొదటి మూడు నెలల్లో దాదాపు 15,900 మంది శరణార్థులు మూడు మధ్యధరాసముద్ర మార్గాల ద్వారా యూరప్‌ చేరుకున్నారు. ఇది 2018లో మొదటి మూడు నెలల్లో వచ్చిన వారి కన్నా 17 శాతం తక్కువ.2019లో మొరాకో నుంచి బయల్దేరి పడవ సైతం మధ్యధరా సముద్రానికి పశ్చిమాన అలబోరన్‌ తీరంలో మునిగిపోయింది.ఇందులో 53 మంది వలసదారులు గల్లంతయ్యారు. ఇవి కాకుండా లిబియాలోని జువార తీరంలో మరో పడవ మునగడంతో తాము 47 మందిని రక్షించినట్లు ఛారిటీ సీ వాచ్‌ సంస్థ వెల్లడించింది.

2019 జనవరి నెలలో శరణార్ధులు ప్రయాణిస్తున్న రెండు పడవలు మునిగిపోయి దాదాపు 170 మంది గల్లంతయ్యారు. విషాదకర ఘటన మధ్యధరా సముద్ర తీరంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గల్లంతైన వారంతా చనిపోయి ఉంటారని అధికారులు తెలిపారు. వీరిలో 10 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు, రెండు నెలల శిశువు కూడా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

జనవరి, 2016లో మధ్యధరా సముద్రం మీదుగా ఐరోపా దేశాలకు 2.04 లక్షల మంది వలస వెళ్లారు. అయితే, లిబియా నుంచి ఇటలీకి వెళుతున్న క్రమంలో వందలాది మంది వలసదారులు మృత్యువాత పడుతున్నారు. 2019 మొదటి నాలుగు నెలల్లో 164 మంది చనిపోయినట్లు యూఎన్‌హెచ్‌సీఆర్ వెల్లడించింది. 2019లో మొదటి మూడు నెలల్లో మూడు మధ్యధరాసముద్ర మార్గాల ద్వారా యూరప్‌ దేశాలకు15,900 మంది శరణార్థులు చేరుకున్నారు. ఇది 2018లో మొదటి మూడు నెలల్లో వచ్చిన వారి కన్నా 17 శాతం తక్కువ అని యూఎన్‌ఓ ఓ నివేదిక ద్వారా వెల్లడించింది. 2018లో మధ్యధరా సముద్రం దాటుతూ సగటున రోజుకు ఆరుగురు శరణార్థులు చనిపోయారని పేర్కొంది ఐక్యరాజ్యసమితి.

ఏప్రిల్‌ 19,2015 వలస కూలీలను మోసుకెళుతున్న ఓ భారీ బోటు బియా తీరంలోని లాంపెడూసా దీవి సమీపంలో మునిగిపోయింది. ఈ బోటులో 700 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటనలో 23 మృతదేహాలు మాత్రమే లభ్యం కాగా, మరో 28 మందిని కాపాడిన ఇటలీ కోస్టుగార్డులు సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు.

ఆగస్టు 28,2015 జువారా పట్టణం నుండి 400 మందితో ఇటలీ వైపు వెళుతున్న ఓ నౌక లిబియా తీర ప్రాంతంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 200 మంది జలసమాధి అయ్యారు. ఇక, జూన్‌4, 2016 మధ్యధరా సముద్రం గ్రీస్ తీరంలో బోటు బోల్తా పడి 117 మంది మృత్యువాతపడ్డారు. మే 11, 2019 ట్యునీసియా సమీపంలో మునిగిన బోటు 65 మంది ప్రాణాలను కోల్పోయారు.

Read Also…  Mars: మార్స్ పై నాసా మరో అద్భుత సృష్టి.. అరుణ గ్రహంపై ఆక్సిజన్ తయారు చేసిన రోవర్… ( వీడియో )