Suicide: బీహార్‌లో విషాదం.. ఉరి వేసుకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..
Bihar's Family Suicide: బీహార్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏం కష్టమొచ్చిందో ఏమో కానీ. ముగ్గురు పిల్లలతో సహా దంపతలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఐదుగురు కూడా ఉరి వేసుకొని..
Bihar’s Family Suicide: బీహార్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏం కష్టమొచ్చిందో ఏమో కానీ. ముగ్గురు పిల్లలతో సహా దంపతలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఐదుగురు కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబం కొన్ని రోజులుగా తలుపులు తీయకపోవడం.. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు ఇంటి తాళాలు పగులగొట్టి చూశారు. ఒకే గదిలో దంపతులు, ఇద్దరు కూతుళ్లు, కుమారుడి మృతదేహాలు వేలాడుతుండటం చూసి వారంతా షాక్‌కు గురయ్యారు.
ఈ సంఘటన బీహార్‌లోని సుపాల్ జిల్లా రాఘోపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గడ్డీ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మృతదేహాలను చూసిన స్థానికులు భయంతో గ్రామపెద్దలకు సమాచారం అందించారు. సమాచారం మేరకు రాఘోపూర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఎస్పీ మనోజ్‌కుమార్ గ్రామానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అయితే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా.. లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా.. అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు మనోజ్ కుమార్ తెలిపారు. ఫోరెన్సిక్ బృందాన్ని సైతం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు.
అయితే స్థానికులు మాత్రం మిశ్రీ లాల్ సాహ్ కుటుంబం ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పేర్కొంటున్నారు. కుటుంబానికి గ్రామస్తులతో పెద్దగా పరిచయం లేదని, గత కొద్ది రోజులుగా కుటుంబ సభ్యులెవరూ ఆ ప్రాంతంలో కనిపించడం లేదని వెల్లడించారు. వారి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కూడా కారణం కావొచ్చని తెలుపుతున్నారు. వారు రెండు మూడు రోజుల కిందట మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై ఫొరెన్సిక్ అభికారుల బృందం కూడా దర్యాప్తు చేస్తోంది. అయితే గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో.. భయాందోళన నెలకొంది.
Bihar: Five members of a family died allegedly by suicide in Supaul
“Forensic Science Laboratory team will investigate the site and we will conduct a detailed investigation, ” said police yesterday pic.twitter.com/DHxNFd03je
— ANI (@ANI) March 13, 2021
Also Read: