మళ్లీ డ్రగ్స్ రగడ, నటుడు తనీష్‌ సహా ఇంకొందరికి బెంగళూరు పోలీస్ నోటీసులు, ఇంతకీ.. ఎవరా ఐదుగురు..?

Drugs case : టాలీవుడ్‌..డ్రగ్స్‌. ఈ రెంటింటికీ ఏదో విడదీయరాని బంధముంది. రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం వదలదన్నట్లు.. డ్రగ్స్ రాకెట్ టాలీవుడ్‌ చుట్టే తిరుగుతోంది. తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీని వదలడం లేదు..

మళ్లీ డ్రగ్స్ రగడ, నటుడు తనీష్‌ సహా ఇంకొందరికి బెంగళూరు పోలీస్ నోటీసులు, ఇంతకీ.. ఎవరా ఐదుగురు..?
Follow us

|

Updated on: Mar 13, 2021 | 1:18 PM

Drugs case : టాలీవుడ్‌..డ్రగ్స్‌. ఈ రెంటింటికీ ఏదో విడదీయరాని బంధముంది. రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం వదలదన్నట్లు.. డ్రగ్స్ రాకెట్ టాలీవుడ్‌ చుట్టే తిరుగుతోంది. తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీని వదలడం లేదు. డ్రగ్స్‌ ఎక్కడ పట్టుబడినా దాని లింకులు టాలీవుడ్‌లో వెలుగుచూస్తున్నాయి. బాలీవుడ్, శాండిల్‌వుడ్‌..ఇలా ఎక్కడ తీగ లాగినా డొంక టాలీవుడ్‌లో కదులుతోంది. డ్రగ్స్‌ పేరు చెబితేనే హైదరాబాద్‌ ఉలిక్కిపడుతోంది. ఎక్కడ కేసు నమోదైనా టాలీవుడ్‌లో దడ మొదలవుతోంది. గతంలో డ్రగ్స్‌ కేసు విచారణతో ఉక్కిరిబిక్కిరి అయిన తెలుగు ఇండస్ట్రీ… ఆ షాక్‌ నుంచి మెల్లిగా కోలుకుంది. ఇప్పుడు ఇతర్రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లోనూ ఇక్కడి స్టార్స్‌ పేర్లు వినిపిస్తుండటం టెన్షన్‌ పెడుతోంది.

మత్తు దందా మళ్లీ తెరపైకొచ్చింది..శాండిల్‌వుడ్‌ వయా టాలీవుడ్‌లో ప్రకంపనలు పుట్టిస్తోంది. డ్రగ్స్‌ కేసులో నటుడు తనీష్‌కు నోటీసులు జారీ చేశారు బెంగళూరు పోలీసులు. తనీష్‌తో పాటు మరో ఐదుగురికి నోటీసులిచ్చిన పోలీసులు.. విచారణకు పిలిచారు. ఇంతకీ ఎవరు..? ఎవరా ఐదుగురు..? డ్రగ్స్‌ కేసులో తనీష్‌ పాటుగా బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేసింది ఎవరికి..? అంటే..ఈ ఐదుగురిలో పలువురు ప్రముఖులున్నట్లు తెలుస్తోంది. ఐతే ఎవరా ఐదుగురు అన్నది ఉత్కంఠగా మారింది.

తనకు బెంగళూరు పోలీసులు నోటీసులిచ్చినమాట వాస్తవమేనని..కానీ డ్రగ్స్ తీసుకున్నందుకు కాదంటున్నారు తనీష్‌. 67 NDPS యాక్ట్‌ కింద నోటీసులిచ్చారని అంటున్నారు. తాను 2017లో బెంగళూరు శంకర్‌ గౌడ్‌ ఇచ్చిన పార్టీకి వెళ్లానన్న తనీష్‌… తాను ఆ పార్టీలో డ్రగ్స్‌ తీసుకోలేదంటున్నారు. శాండిల్‌వుడ్‌లో డ్రగ్స్‌ కేసుకు సంబంధించి..విట్నెస్‌ విషయంలో మాత్రమే నోటీసులిచ్చారని వెల్లడించారు. బెంగళూరులో శంకర గౌడ్‌ ఏర్పాటు చేసిన పార్టీకి..డ్రగ్‌ పెడ్లర్‌ ఫయ్యూం, జాన్‌ నుంచి డ్రగ్స్‌ సరఫరా అయ్యేవన్న సమాచారంతో..ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతుండగానే..డ్రగ్స్ కోణం వెలుగులోకి రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. రియాతో పాటు పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, డ్రగ్స్‌ పెడ్లర్లనూ విచారించింది. 33మంది..12వేల పేజీలు..బాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో ఛార్జిషీట్‌ రెడీ చేసింది ఎన్సీబీ. రియా, ఆమె సోదురుడు సహా మొత్తం 33మంది పేర్లను ఈ ఛార్జిషీట్‌లో పేర్కొంది. మహారాష్ట్రలో డ్రగ్స్‌ తీగ కదిలిస్తే… శాండిల్‌వుడ్‌లోనూ లింకులు బయటపడ్డాయి. ఇది అప్పట్లో కలకలం రేపింది. ఈ కేసులో పట్టుబడ్డ ఇద్దరు హీరోయిన్లు సంజనా , రాగిణి అరెస్టయ్యారు. వరుస అరెస్టులతో శాండల్‌వుడ్‌, టాలీవుడ్‌ వణుకిపోయాయి. వాళ్ల విచారణలో ఇంకెంతమంది స్టార్స్‌ పేర్లు బయటకు వస్తోయోనని టెన్షన్‌ పడ్డాయి.

2017లో టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న తనీష్‌..అప్పట్లో విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్‌ ఎక్కడి నుంచి సరఫరా అయ్యేవి..? ఎవరు సప్లై చేసేవారు..?పెడ్లర్స్‌తో సంబంధాలు ఇలా పలు కోణాల్లో తనీష్‌ను సుదీర్ఘంగా విచారించారు పోలీసులు. అప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ కేసు విచారణ ఏళ్ల తరబడి కొసాగుతూనే ఉంది. అప్పట్లో ఓ నెల రోజుల పాటు టాలీవుడ్‌ ప్రముఖులను పరుగులు పెట్టించారు పోలీసులు. అంతే ఆ తర్వాత ఆ వేడంతా చల్లారిపోయింది. ఇకిప్పుడు మళ్లీ హడావుడి షురూ అయింది.

Read also : AP Bhavan : స్టీల్‌ సిటీ నుంచి హస్తినకు విసర్తించిన ఉక్కు మంటలు, నినాదాలతో హోరెత్తిపోతోన్న ఏపీ భవన్‌

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!