Crime: పెళ్లి కాకుండానే ప్రసవం.. ఆపై బిడ్డను కిటికీలోంచి విసిరేసి.. చివరకు ఏం జరిగిందంటే..?

Woman throws newborn: ఆ యువతి అక్రమ సంబంధంతో గర్భం దాల్చింది. అనంతరం ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం పురిటిబిడ్డను

Crime: పెళ్లి కాకుండానే ప్రసవం.. ఆపై బిడ్డను కిటికీలోంచి విసిరేసి.. చివరకు ఏం జరిగిందంటే..?
Child
Follow us
Shaik Madar Saheb

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 09, 2021 | 6:30 PM

Woman throws newborn: ఆ యువతి అక్రమ సంబంధంతో గర్భం దాల్చింది. అనంతరం ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం పురిటిబిడ్డను శౌచాలయం కిటికీలోంచి బయటకు విసిరేసింది. దీంతో నవజాత శిశువు మరణించింది. ఈ అమానవీయ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్టలో చోటుచేసుకుంది. హెసరఘట్టకు చెందిన యువతి (22) అక్రమ సంబంధం కారణంగా గర్భం దాల్చింది. నెలలు నిండడంతో ఆమె ప్రియుడు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చి జాయిన్ చేశాడు. అనంతరం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. పురిటిబిడ్డను శౌచాలయంలోని కిటికీలోంచి విసిరేసి పరారైంది. ఇది గమనించిన అక్కడున్నవారు.. పారిపోతున్న యువతిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు.

శిశువును బయటకు విసిరేసి హతమార్చినట్లు ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. డెలివరీ తర్వాత ఆరోగ్య సమస్యలు ఏర్పడడంతో మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. యువతి గర్భం దాల్చడానికి కారణమైన గుడేమారనహళ్లికి చెందిన శశాంక్‌ (25) అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇద్దరిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

కొంతకాలం నుంచి యువకుడు, యువతి ప్రేమించుకుంటున్నారని.. పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో శిశువును చంపాలని నిర్ణయించుకున్నారని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం మహిళ చికిత్స పొందుతుందని.. చికిత్స అనంతరం ఆమెను కూడా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

Also Read:

Hyderabad: నడిరోడ్డుపై మలవిసర్జన.. ప్రశ్నించిన పాపానికి తిట్ల దండకం.. సెల్‌ఫోన్ లాక్కొని హోంగార్డుపై దాడికి యత్నం!

Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..