AP Revenue department: మెరుపు దాడులతో ఏపీ రెవెన్యూశాఖలో టెర్రర్.. పీలేరు మండలంలో 250 ఎకరాల భూమి కబ్జా

అందులేరు...ఇందులేరు...ఎందెందు వెదికినా అందునా కలరయా...అవినీతి, అక్రమార్కులు అన్న చందంగా తయారైంది ఏపీ రెవెన్యూశాఖ పరిస్థితి. రాష్ట్రంలోని వేల ఎకరాల...

AP Revenue department: మెరుపు దాడులతో ఏపీ రెవెన్యూశాఖలో టెర్రర్.. పీలేరు మండలంలో 250 ఎకరాల భూమి కబ్జా
Ap Revenue Department

రెవెన్యూశాఖలో అవినీతి మకిలిని ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం దూకుడు పెంచింది. భూపందారంలో ఎంతటి వాళ్లున్న…ఎంత మంది ఉన్నా…అందరిని బయటకు లాగుతోంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా మెరుపుదాడులు చేస్తూ పక్కా యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తోంది. అందులేరు…ఇందులేరు…ఎందెందు వెదికినా అందునా కలరయా…అవినీతి, అక్రమార్కులు అన్న చందంగా తయారైంది ఏపీ రెవెన్యూశాఖ పరిస్థితి. రాష్ట్రంలోని వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములు వేరే వ్యక్తులపై బదలాయిస్తున్నారన్న విమర్శలతో ప్రభుత్వం ఆశాఖలోని అవినీతి డొంకను కదలిస్తోంది. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాలోని భూపందారం వెనుక ఉన్న కొందరు అవినీతి అధికారులను జైలుకు పంపింది. జిల్లాలోని తిరుపతి, మదనపల్లి, పీలేరులో ప్రభుత్వ భూములతో పాటు చెరువులు, చుక్కల భూములు, డికేటి స్తలాలు ఇలా అన్నింటిని ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యాయి. ఇందులో రెవిన్యూ శాఖలోని కొంత మంది సిబ్బంది సహకారం ఉందన్న ఆరోపణలు జిల్లా కలెక్టర్ చేపట్టిన విచారణలో వాస్తవమని తేలింది.

ముఖ్యంగా పీలేరు మండలంలో 250 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లుగా అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన రెవెన్యూ సిబ్బందిపై క్రిమినల్ కేసులు పెట్టారు. వారికి సహకరించిన ఇద్దరు రెవిన్యూ ఇన్స్పెక్టర్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అక్రమ కట్టడాలను సైతం కూల్చివేసిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాల్లో వేసిన లేఅవుట్లను చదును చేసి ప్రభుత్వ స్థలాలుగా బోర్డులు పెట్టారు. అటు మదనపల్లి బసినికొండలోని సర్వేనెంబర్ 718 / 3 లోని 2.40 ఎకరాల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా ఆన్‌లైన్‌లో మార్చి అమ్మేశారు.ఈ వ్యవహారంలో శివాని అనే మహిళ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అక్కడ తహసిల్దార్ గా పనిచేసిన రమాదేవి, శివరామిరెడ్డి, సురేష్ బాబు, విఆర్వో శ్రీనివాసులుపై కూడా క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఈ నలుగురిలో ఒకరు చనిపోగా మిగిలిన ముగ్గురుని రిమాండ్‌కు పంపారు. ప్రభుత్వం అవినీతి అధికారుల భరతం పట్టడాన్ని రెవిన్యూ సంఘం నాయకులు, బాధితులు ఖండిస్తున్నారు. శాఖాపరమైన విచారణ పూర్తి కాకుండా ఎలా క్రిమినల్‌గా ముద్రవేస్తాని ప్రశ్నిస్తున్నారు.

Also Read: సంచలనం… సిద్ధార్థ్ శుక్లా మృతిపై స్పందించిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సెనా

హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

Click on your DTH Provider to Add TV9 Telugu