Viral Video: మాస్క్ పెట్టుకోలేదని ఫైన్ కట్టమంటే.. ఆ డ్రైవర్ చేసిన ఘనకార్యం చూడండి.. వీడియో వైరల్
BMC Cleanup Marshal: కరోనా వైరస్ సెకండ్ వేవ్ అనంతరం.. పరిస్థితులు ఇప్పుడిప్పుడే క్రమంగా గాడినపడుతున్నాయి. ఈ తరుణంలో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచిఉందంటూ నిపుణులు
BMC Cleanup Marshal: కరోనా వైరస్ సెకండ్ వేవ్ అనంతరం.. పరిస్థితులు ఇప్పుడిప్పుడే క్రమంగా గాడినపడుతున్నాయి. ఈ తరుణంలో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచిఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా నిబంధనలను పాటించాలని కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రజలను పదేపదే అవగాహన కలిగిస్తున్నాయి. కోవిడ్ ఆంక్షలు పాటించకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నాయి. ఈ తరుణంలో కూడా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా.. ప్రభుత్వ సిబ్బందిపైనే దాడులకు తెగబడుతున్నారు. తాజాగా.. మాస్క్ పెట్టుకోలేదని కారును ఆపిన మార్షల్‌పై డ్రైవర్ దారుణంగా ప్రవర్తించాడు. ఏకంగా కారుతో మార్షల్‌పైకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో మార్షల్ చాకచక్యంగా వ్యవహరించి.. కారు బానెట్ సహాయంతో సురక్షితంగా బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన బుధవారం ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది.
కరోనా కట్టడికి బీఎంసీ ప్రణాళికలను రచించి.. కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా ముంబైలో మార్షల్స్‌ను నియమించింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం శాంతాక్రజ్‌లోని హన్స్ భుగ్రా సిగ్నల్ దగ్గర డ్యూటీ చేస్తున్న సురేష్ పవార్ (36) కారులో మాస్కు పెట్టుకొని మహిళను గమనించాడు. వెంటేనే కారును ఆపి రూ.200 జరిమానా చెల్లించాలని పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఆమె ఫైన్ చెల్లించేందుకు అంగీకరించింది. కానీ క్యాబ్ డ్రైవర్.. జరిమానా విదించడంపై వాదించాడు. అనంతరం డ్రైవర్ కారును ముందుకు నడపడం ప్రారంభించగా.. సురేష్ పవార్ అడ్డుకున్నాడు. కానీ డ్రైవర్ అలా కారును ముందుకు మూవ్ చేయడంతో.. మార్షల్ కారు బానెట్ పట్టుకొని వేలాడుతూ కనిపించాడు. వీడియో..
#ViralVideo Of #BMC Marshal Being drag by Tourist car driver with his Wagorn car on the streets of #mumbai @mybmc @RoadsOfMumbai @mumbaicommunity #MaskUp #Goregaon @IqbalSinghChah2 @RetweetsMumbai @PotholeWarriors @mymalishka pic.twitter.com/jGGXhiDKUH
— Mohsin shaikh ?? (@mohsinofficail) September 1, 2021
ఈ దృశ్యాన్ని అక్కడున్న ఓ వ్యక్తి కెమెరాలో బంధించాడు. అయితే.. ఈ ఘటనలో పవార్‌కు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. అలా కొంతదూరం వెళ్లిన అనంతరం డ్రైవర్ పక్కకు తప్పుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అనంతరం పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
Also Read: