Bihar MLA: ట్రైన్‌లో ఆ ఎమ్మెల్యే చేసిన గలీజు పనికి ప్రయాణికుల పరేషాన్‌.. ఏం చేశాడంటే..?

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Sep 04, 2021 | 7:34 PM

MLA In Underwear: అతను అన్ని తెలిసిన వ్యక్తి.. పైగా ఎమ్మెల్యే.. ఓ పార్టీకి నాయకుడిగా ఉన్న ఆ వ్యక్తి విచక్షణ కోల్పోయాడు. చివరకు రైల్లో దుస్తులు లేకుండా.. అటు ఇటు తిరుగుతూ

Bihar MLA: ట్రైన్‌లో ఆ ఎమ్మెల్యే చేసిన గలీజు పనికి ప్రయాణికుల పరేషాన్‌.. ఏం చేశాడంటే..?
Bihar Mla In Underwear

MLA In Underwear: అతను అన్ని తెలిసిన వ్యక్తి.. పైగా ఎమ్మెల్యే.. ఓ పార్టీకి నాయకుడిగా ఉన్న ఆ వ్యక్తి విచక్షణ కోల్పోయాడు. చివరకు రైల్లో దుస్తులు లేకుండా.. అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. డ్రాయర్ మీదనే వాష్ రూమ్‌కు వెళుతూ ప్రయాణికులను వణికించాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హల్‌చల్‌గా మారింది. ఇది చూసినవారంతా ఎమ్మెల్యే అయివుండి ఇలా ప్రవర్తిస్తారా..? అంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీహార్‌ నుంచి ఢిల్లీ వెళుతున్న ట్రైన్‌ ఏసీ కోచ్‌లో ఆ ఎమ్మెల్యే.. ఇలా కనిపించగా.. ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.

బీహార్‌లో అధికార పార్టీ జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) పార్టీకి చెందిన ఎమ్మెల్యే గోపాల్ మండల్ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ క్రమంలో పాట్నా-న్యూఢిల్లీ తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కారు. ఆ సమయంలో దుస్తులన్నీ విప్పేసి కేవలం బనియన్, అండర్‌వేర్‌పై కనిపించారు. దీనిపై ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. దీంతో గోపాల్ ప్రయాణికులతో గొడవకు దిగారు. విషయం తెలిసి అక్కడకు వచ్చిన అధికారులు ఇరువురికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత గోపాల్ మండల్ తన సీట్లోకి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారడంతో.. నెటిజన్లు ఎమ్మెల్యేపై దుమ్మెత్తిపోస్తున్నారు.

ఏసీ కోచ్లో ఎమ్మెల్యే అండర్‌వేర్‌పై బాత్‌రూంకి వెళుతూ కనిపించారు. చూసి షాకైన ప్రయాణికులు ఎవరూ మాట్లాడలేదు. చివరకు ఓ ప్రయాణికుడు తన కోపాన్ని అణుచుకులేకపోయాడు. ఇక్కడ ఆడవాళ్లు కూడా ఉన్నారు.. మర్యాదగా ప్రవర్తించండి అంటూ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. అయితే ఈఘటన వైరల్‌ కావడంతో గోపాల్ మండల్ మొదట తనను తాను సమర్థించుకున్నారు. తనకు కడుపులో బాగలేదని, అందుకే దుస్తులు విప్పి వెళ్లినట్లు పేర్కొన్నారు.

కాగా.. ఈ ఘటన అనంతరం ప్రయాణికుడు ప్రహ్లాద్ పాశ్వాన్ ఢిల్లీలోని రైల్వే పోలీస్ స్టేషన్‌లో భాగల్‌పూర్ జిల్లాలోని గోపాల్‌పూర్‌కు చెందిన ఎమ్మెల్యే గోపాల్ మండల్ పై ఫిర్యాదు చేశారు. అండర్ వేర్ పై తిరుగతున్న తాను అభ్యంతరం చెప్పడంతో తన బంగారు ఆభరణాలను ఎమ్మెల్యే లాక్కున్నట్లు ఆరోపించారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే తాగి ఉన్నాడని పేర్కొన్నారు.

Also Read:

CM KCR: కొత్త ఐపీఎస్‌లను కేటాయించండి: హోం మంత్రి అమిత్‌షాకు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి

ట్రెయినీ ఎయిర్‌ హోస్టెస్‌పై విద్యార్థి అఘాయిత్యం.. మ‌త్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఆపై వీడియోలు తీసి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu