John Cena: సంచలనం.. సిద్ధార్థ్ శుక్లా మృతిపై స్పందించిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సెనా
ఇక సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు, బాలీవుడ్ టీవీ నటీనటుల ఆశ్రునివాళి మధ్య సిద్ధార్థ్ అంత్యక్రియలు ముగిశాయి. అంతకు ముందే ఆయన మృతదేహానికి పరీక్షలు నిర్వహించారు.
బిగ్‌బాస్ 13(హిందీ) విన్నర్, నటుడు సిద్ధార్థ్ శుక్లా ఆకస్మిక మరణం తీవ్ర సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆయన ఒక్కసారిగా దూరం అయిపోవడాన్ని సన్నిహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 40 ఏళ్ల వయసులో అంత ఫిట్‌గా ఉన్న వ్యక్తి గుండెపోటుతో మరణించడం చాలామందిని విషాదంలోకి నెట్టింది. అయితే సిద్ధార్థ్ శుక్లా మరణంపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై మున్ముందు పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఇక సిద్ధార్థ్ ఫ్యామిలీ మెంబర్స్, బాలీవుడ్ నటీనటుల ఆశ్రునివాళి మధ్య సిద్ధార్థ్ అంత్యక్రియలు ముగిశాయి. అంతకు ముందే ఆయన మృతదేహానికి పంచానామా, పోస్ట్‌మార్టం నిర్వహించారు వైద్యులు. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని.. ఇది గుండెపోటు కారణంగా జరిగిన మరణమే అని వాళ్లు దాదాపుగా నిర్ధారించారు. ప్రాథమిక సమాచారం మేరకు కార్డియాక్ అరెస్ట్ తోనే సిద్ధార్థ్ మరణించినట్లు ప్రకటించారు. దాంతో, అతని మృతికి అసలు కారణమేంటో తేలకుండా పోయింది. మరి, సిద్ధార్థ్ శుక్లా డెత్ మిస్టరీ గుట్టు వీడేదెలా? మరో మార్గం లేదా అంటే… ఉందంటున్నారు వైద్యులు. హిస్టోపథాలజీతో గుట్టు విప్పొచ్చంటున్నారు. ఇంతకీ, హిస్టోపథాలజీ అంటే ఏమిటి? ఇదొక కెమికల్ అనాలసిస్. కీలక ఆర్గాన్స్ ను కెమికల్ అనాలసిస్ చేస్తే సిద్ధార్థ్ డెత్ మిస్టరీ వీడిపోనుంది. అందుకే, సిద్ధార్థ్ శుక్లా ఆర్గాన్స్ ను కెమికల్స్ లో భద్రత పర్చినట్లు కూపర్ హాస్పిటల్ వర్గాలు ప్రకటించాయి.
ఇప్పటికే సిద్ధార్థ్ మృతిపై భారతదేశంలోని దాదాపు అన్ని ఇండస్ట్రీల నుంచి నటీనటులు సంతాపం తెలియజేశారు. అయితే ఇప్పుడు ఈ సిద్దార్థ్ మరణం విషయం అంతర్జాతీయ స్థాయికి చేరింది. అవును ఇది నిజంగా సంచలన విషయమే. సిద్ధార్థ్ శుక్లా మృతిపై ఓ ఇంటర్నేషనల్ బిగ్ సెలబ్రిటీ స్పందించారు. ఆయన మరెవరో కాదు.. ‘జాన్ సెనా’. డబ్ల్యూడబ్ల్యూఈలో తిరుగులేని స్టార్‌గా ఆయనకు పేరుంది. ఓవైపు రెజ్లింగ్ టోర్నమెంట్‌లో పాల్గొంటూనే.. పలు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాను జాన్. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఎంతో క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఇండియాలో ఆయనకు భారీ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు సిద్ధార్థ్ శుక్లా మృతిపై జాన్ సెనా స్పందించడం.. తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే కేవలం సిద్ధార్థ్ ఫోటోని మాత్రమే ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. శ్రద్ధాంజలి ఘటించడం కానీ, సంతాపం ప్రకటించడం కానీ చేయలేదు. మరి జాన్ సెనా పోస్ట్ ఎందుకు చేశారన్నది మాత్రం తెలియడం లేదు. అది ఫోటో ట్రిబ్యూట్ అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
View this post on Instagram
Also Read: హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు