Crime News: అనంతపురం జిల్లా కసాయి తండ్రి అరెస్ట్.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు..
పిల్లలంటే తల్లిదండ్రులకు ఎనలేని ప్రేమ ఉంటుంది. పిల్లలే వారి ప్రపంచంగా బతుకుతారు. పిల్లల కోసమే కష్టపడతారు. సాధారణంగా కొడుకు అంటే తల్లికి ఇష్టం ఉంటుంది. కూతురు అంటే తండ్రికి ఇష్టం ఉంటుంది....
పిల్లలంటే తల్లిదండ్రులకు ఎనలేని ప్రేమ ఉంటుంది. పిల్లలే వారి ప్రపంచంగా బతుకుతారు. పిల్లల కోసమే కష్టపడతారు. సాధారణంగా కొడుకు అంటే తల్లికి ఇష్టం ఉంటుంది. కూతురు అంటే తండ్రికి ఇష్టం ఉంటుంది. కానీ ఓ తండ్రి రాక్షసుడిగా మారాడు. పాము తన పిల్లల్ని తానే తిన్నట్లు కుమార్తెను చంపాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. హత్య చేసిన తర్వాత పారిపోయిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామానికి బ్యాంకు ఉద్యోగి అయిన మల్లిఖార్జున్కు కొద్ది సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. గత కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో అతడికి కూతురు పుట్టింది. మూడు నెలల తర్వాత భార్యతో గొడవపడి మూడు నెలల పాపను మల్లిఖార్జున్ తీసుకెళ్లాడు. అయితే తన పాపను భర్త మల్లీ చెరువులో పడేసినట్లు చిట్టెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు పాప కోసం గాలింపు చర్యలు చేపట్టగా అసలు విషయం బయటపడింది. అనంతపురంలో నిందితుడిని అరెస్టు చేశారు. విచారించగా చిన్నారిని చంపి పాతిపెట్టినట్లు ఒప్పుకున్న కసాయి తండ్రి మల్లికార్జున ఒప్పుకున్నాడు. భార్యపై అనుమానంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది.
నిందితుడిని కోర్టు తరలిస్తుండగా చిన్నారి తల్లి చిట్టెమ్మ కుటుంబసభ్యులు అతడిపై దాడికి యత్నించారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై దాడి జరగకుండా నిందితున్ని కోర్టుకు తరలించారు. చిట్టెమ్మ కుటుంబ సభ్యులు ఆ దుర్మార్గున్ని చంపాలంటూ బోరున విలపించారు. మరోవైపు ఇంతటి దారుణానికి ఎందుకు ఒడిగట్టాడని నిందితున్ని టీవీ9 ప్రశ్నించే ప్రయత్నం చేసింది. కాకపోతే నిందితుడు తనకేం తెలియదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
Read Also.. Crime news: ఏపీ గుంటూరులో మరో దారుణం.. ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారయత్నం.. కర్రలతో కొట్టి..