కన్నూర్‌ విమానాశ్రయంలో పట్టుబడ్డ బంగారం

కేరళలో నిత్యం బంగారం పట్టుబడుతోంది. విదేశాల నుంచి వస్తున్న వారిని తనిఖీలు చేస్తుండగా.. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. బుధవారం నాడు కోజికోడ్‌ విమానాశ్రయంలో..

కన్నూర్‌ విమానాశ్రయంలో పట్టుబడ్డ బంగారం
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2020 | 8:55 PM

కేరళలో నిత్యం బంగారం పట్టుబడుతోంది. విదేశాల నుంచి వస్తున్న వారిని తనిఖీలు చేస్తుండగా.. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. బుధవారం నాడు కోజికోడ్‌ విమానాశ్రయంలో బంగారాన్ని పొడి రూపంలో తరలిస్తుండగా పట్టుకున్న సంగతి మర్చిపోకముందే.. గురువారం నాడు కన్నూర్‌ విమానాశ్రయంలో ఎయిర్ ఇంటెలిజెన్స్‌ విభాగం జరిపిన తనిఖీల్లో 657 గ్రాముల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 30.55 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడిని తనిఖీలు చేయగా.. ఈ బంగారం కడ్డీలు గుర్తించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు.

Read More :

ఒడిషాలో 70 వేలకు చేరిన పాజిటివ్‌ కేసులు

మహారాష్ట్రలో మరో 117 పోలీసు సిబ్బందికి పాజిటివ్