Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jacqueline Fernandez: వరుసగా నాలుగోసారి డుమ్మా.. ఈడీ విచారణకు హాజరుకాని బాలీవుడ్ నటి జాక్వెలిన్‌

Money Laundering Case: మనీ లాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇప్పటికే పలువురు నటులను విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈడీ

Jacqueline Fernandez: వరుసగా నాలుగోసారి డుమ్మా.. ఈడీ విచారణకు హాజరుకాని బాలీవుడ్ నటి జాక్వెలిన్‌
Jacqueline Fernandez
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 18, 2021 | 8:27 PM

Money Laundering Case: మనీ లాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇప్పటికే పలువురు నటులను విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కూడా నోటీసులు పంపింది. ఈ కేసులో జాక్వెలిన్ నాలుగోసారి కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు హాజరు కాలేదు. గతంలో మూడు సార్లు కూడా హాజరుకాని జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. తాజాగా సోమవారం కూడా విచారణకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సుఖేష్‌ చంద్రశేఖర్‌, ఆయన భార్య లీనా పౌల్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే బాలీవుడ్ నటి నోరాఫతేహి, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఈడీ.. ఆమె వాంగ్మూలాన్ని ఆగస్టు 30వ తేదీన నమోదు చేసుకుంది. నాటి నుంచి ఫెర్నాండెజ్ విచారణకు హాజరుకావడం లేదు. సెప్టెంబర్‌ 25, అక్టోబర్‌ 15,16 తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆమె విచారణకు హాజరుకాలేదు. ఈ రోజు కూడా ఆమె హాజరు కావాల్సి ఉండగా.. హాజరుకాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వృత్తిపరంగా ఫెర్నాండెజ్ బిజీగా ఉండటంతో విచారణకు హాజరుకావడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా.. ఈ మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే సుఖేష్‌ చంద్రశేఖర్‌, లీనా పౌలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ వ్యాపార వేత్త శివేందర్‌ సింగ్‌ భార్య అథితి సింగ్‌ ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నోరా ఫాతేహిను కూడా అధికారులు ప్రశ్నించి.. వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. జాక్వెలిన్‌ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసేందుకు ఈడీ విచారణకు పిలిచింది. గత మూడు సంవత్సరాల బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన స్టేట్‌మెంట్లతో హాజరు కావాలని ఈడీ స్పష్టంచేసింది.

Also Read:

Mysterious Death: బిస్కెట్లు, చిప్స్ తిని కుప్పకూలిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. 24 గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు..

Road Accident: హైవేపై ఘోర ప్రమాదం.. వరుసగా ఢీకొన్న ఆరు వాహనాలు.. ముగ్గురు దుర్మరణం..

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!