AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రియుడితో ఏకాంతంగా బాలిక.. అది గమనించిన తల్లి వార్నింగ్.. ఆ వెంటనే ఊహించని ఘటన..!

Hyderabad: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తమ ప్రేమను తప్పుబట్టిందనే కారణంతో మైనారిటీ కూడా తీరని ఓ కూతురు

Hyderabad: ప్రియుడితో ఏకాంతంగా బాలిక.. అది గమనించిన తల్లి వార్నింగ్.. ఆ వెంటనే ఊహించని ఘటన..!
Crime News
Shiva Prajapati
|

Updated on: Oct 19, 2021 | 5:34 AM

Share

Hyderabad: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తమ ప్రేమను తప్పుబట్టిందనే కారణంతో మైనారిటీ కూడా తీరని ఓ కూతురు తన ప్రియుడితో కలిసి కన్న తల్లిని కడతేర్చింది. ఈ ఘోర సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్రనగర్ పరిధిలోని చింతల్ మెట్‌కు చెందిన యాదయ్య, యాదమ్మ రోజూ వారీ కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 17 సంవత్సరాల వయసు ఉన్న కుమార్తె ఉంది. ఆ బాలిక స్థానికంగా ఉన్న మరో బాలుడితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో ఇద్దరూ తరచుగా కలుసుకోవడం సాగిస్తుండేవారు. అయితే ఇది గమనించిన ఆ తల్లి.. తన కూతురును మందలించింది. అయినప్పటికీ బాలికలో మార్పు రాలేదు.

తల్లిదండ్రులు పనికి వెళ్లగానే యధావిధిగా తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఇంతలో బాలిక తల్లి ఇంటికి రాగా, వీరిద్దూ ఏకంతంగా ఉండటం చూసి షాక్ అయ్యింది. ఆ అబ్బాయి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. కానీ, తన కూతురును యాదమ్మ గట్టిగా మందలించింది. చేస్తున్న పని తప్పు అంటూ తిట్టింది. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయిన బాలిక.. జరిగిన విషయాన్ని తన ప్రియుడికి తెలిపింది. తల్లిని చంపేయాలని కుట్ర చేసింది. ఈ క్రమంలోనే బాలుడిని మళ్లీ ఇంటికి పిలిపించింది. బాలిక, బాలుడు ఇద్దరూ కలిసి చున్నీతో ఆమె గొంతుకు ఉరివేసి చంపేశారు. దీనిపై సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాలికను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Gold & Silver Price: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం ధర.. స్థిరంగా వెండి ధర..

Andhra Pradesh: గుంటూరులో అర్దరాత్రి హైడ్రామా.. మాజీ మంత్రి ఇంటికి భారీగా వచ్చిన పోలీసులు.. ఆపై..

Post Office: ఈ 4 పోస్టాఫీసు పథకాలలో అధిక రాబడి..! అదనంగా పన్ను మినహాయింపు