RRR : ఎంపీ రఘురామకృష్ణరాజు కొత్త నాటకానికి తెరతీసి కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారు : ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
AAG Ponnavolu Sudhakar redddy : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి పలు అంశాలు ప్రస్తావించారు...
AAG Ponnavolu Sudhakar redddy : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి పలు అంశాలు ప్రస్తావించారు. రఘురామరాజు పిటిషన్‌ను హైకోర్టు మధ్యాహ్నం డిస్మిస్ చేసిందని చెప్పిన ఆయన, మధ్యాహ్నం రఘురామకృష్ణరాజుకు కుటుంబసభ్యులు భోజనం తీసుకొచ్చారని వెల్లడించారు. అప్పటివరకు కూడా రఘురామకృష్ణరాజు మామూలుగానే ఉన్నారు.. పిటిషన్ డిస్మిస్ కాగానే రఘురామకృష్ణరాజు కొత్త నాటకానికి తెరతీశారని చెప్పారు. పోలీసులు కొట్టారంటూ సాయంత్రం కోర్టులో కట్టుకథ అల్లారని ఏఏజీ పొన్నవోలు అన్నారు. రఘరామకృష్ణరాజు ఆరోపణలపై కోర్టు మెడికల్ కమిటీ వేసిందని, రేపు మధ్యాహ్నంలోగా పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని సూచించిందని పొన్నవోలు స్పష్టం చేశారు. రఘురామకృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా మాటాడిన 46 రికార్డెడ్ వీడియోలను కోర్టుకు సమర్పించామని కూడా ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చెప్పారు. వీటిని ఆధారాలుగా కోర్టుకు సమర్పించామని ఆయన పేర్కొన్నారు.