Tamil Nadu: ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడి.. పది చోట్ల గాట్లు.. కారణమదే

తమిళనాడులోని తిరుచ్చి(Trichy) లో ప్రేమోన్మాది బీభత్సం సృష్టించాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడి చేశాడు. యువతి శరీరంపై పది సార్లు కత్తితో పొడిచాడు. గమనించిన స్థానికులు బాధితురాలిని చికిత్స...

Tamil Nadu: ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడి.. పది చోట్ల గాట్లు.. కారణమదే
Crime
Follow us

|

Updated on: Jun 01, 2022 | 12:24 PM

తమిళనాడులోని తిరుచ్చి(Trichy) లో ప్రేమోన్మాది బీభత్సం సృష్టించాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడి చేశాడు. యువతి శరీరంపై పది సార్లు కత్తితో పొడిచాడు. గమనించిన స్థానికులు బాధితురాలిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా నివాసముండే కేశవన్.. ఇంటర్ చదువుతున్న యువతిని ప్రేమిస్తున్నానని వేధించేవాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడేవాడు. ఈ విషయం ఇంట్లో వారికి తెలిసింది. వారు కేశవన్ ను మందలించారు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు. వారి పెళ్లికి ఒప్పుకునేది లేదని, తమ కూతురిని వేధిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో మరింత రెచ్చిపోయిన కేశవన్..యువతి ఒంటరిగా ఉన్న సమయంలో కత్తితో దాడి చేశాడు. బాధితురాలి శరీరంపై పది చోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి