Hyderabad: రౌడీ షీటర్ అమెర్ దారుణహత్య.. అర్ధరాత్రి కత్తులతో దాడి చేసిన దుండగులు!
హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారణ హత్య చోటు చేసుకుంది. షాహీన్ నగర్‌లో 32 ఏళ్ల రౌడీ షీటర్ అమెర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గతంలో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముబారక్ షిగర్ హత్యలో రౌడీ షీటర్ అమెర్ నిందితుడుగా ఉన్నాడు. ఈ క్రమంలో..

హైదరాబాద్, డిసెంబర్ 14: హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారణ హత్య చోటు చేసుకుంది. షాహీన్ నగర్‌లో 32 ఏళ్ల రౌడీ షీటర్ అమెర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గతంలో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముబారక్ షిగర్ హత్యలో రౌడీ షీటర్ అమెర్ నిందితుడుగా ఉన్నాడు. ఈ క్రమంలో ఈరోజు ఎవరో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో వచ్చి అమెర్‌పై దాడి చేశారు. ఈ దాడిలో అమెర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పహాడీ షరీఫ్ పోలీసులు క్లూస్ టీమ్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలానికి మహేశ్వరం ఎసిపి జానకి రెడ్డి సందర్శించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
12 జనవరి 2024 మూబారక్ సిగార్ మర్డర్ కేసులో ఏ 2 గా అమెర్ ఉన్నాడు. మృతుడిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్ నమోదు అయి ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో ముబారక్ షిగర్ అనే వ్యక్తి హత్యలో అమేర్ ప్రమేయం ఉన్నట్టు స్థానికంగా తెలుస్తుంది. శనివారం రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో వచ్చి అమెర్‌పై దాడి చేశారు. అమెర్ కు తీవ్రంగా గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపి ఆధారాలను సేకరించారు. సంఘటనా స్థలంలో దోరికిన అధారాల అధారంగా నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.








