Crime News: దారుణం.. క్రూరం.. పశువులపై అత్యాచారం.. వాడు అలా.. వీడు ఇలా

Crime News: దారుణం.. క్రూరం.. పశువులపై అత్యాచారం.. వాడు అలా.. వీడు ఇలా
Unnatural Sexual Offence

ఛా.. ఇలాంటి వార్త గురించి చెప్పాలంటేనే అసహ్యం వేస్తుంది. కానీ మన చుట్టూ సొసైటీలో ఇలాంటి ఉన్మాదులు కూడా ఉన్నారని తెలియజేయాల్సిన...

Ram Naramaneni

|

Aug 15, 2021 | 4:32 PM

ఛా.. ఇలాంటి వార్తల గురించి చెప్పాలంటేనే అసహ్యం వేస్తుంది. కానీ మన చుట్టూ సొసైటీలో ఇలాంటి ఉన్మాదులు కూడా ఉన్నారని తెలియజేయాల్సిన ఆవశ్యక్తత మాపై ఉంది.  చిన్నాపెద్ద తేడా లేకుండా బాలికలపై, మహిళలపై అత్యాచారాలు చేసిన కామాంధులను చూశాం.  కానీ సభ్యసమాజం తలదించుకునే రీతిలో గేదెపై లైంగిక దాడి చేశాడు ఓ నీచుడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ప్రబుద్ధుడు… విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి పశువు కంటే దారుణంగా వ్యవహరించాడు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం విజయ కాలనీలో ఈ ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..    విజయ  కాలనీకి చెందిన రమేశ్​ అనే వ్యక్తి.. శనివారం రాత్రి పూట పీకల దాకా తాగాడు. మద్యం మత్తులో కామంతో కళ్లు మూసుకుపోయిన నీచుడు​.. తన లైంగిక వాంఛ తీర్చుకునేందుకు గేదెను ఎంచుకున్నాడు. మూగజీవంపై లైంగిక దాడి చేశాడు. అటుగా వచ్చిన స్థానికులు ఈ దాష్టీకాన్ని చూసి.. కోపోద్రేక్తులయ్యారు.  వెంటనే రమేశ్​ను పట్టుకుని చితకబాదారు. తాళ్లతో కట్టేసి… పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో నిర్బంధించి.. పోలీసులకు అప్పగించారు. ఇతగాడి విపరీత ప్రవర్తన తెలిసి మరికొందరు స్థానికులు నివ్వెరపోయారు. మూగ జీవంగా లైంగిక దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

వనపర్తి జిల్లాలో ఇదే సీన్…

వనపర్తి జిల్లాలో కూడా ఇలాంటి నీచ ఘటనే చోటుచేసుకుంది.  ఓ వ్యక్తి గేదెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలోనే ఊహించని రీతిలో చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరానికి చెందిన ఆంజనేయులు అనే 45 ఏళ్ల వ్యక్తి వ్యవసాయ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అతను ఇటీవల ఓ గేదెపై అఘాయిత్యానికి పాల్పడుతూ గ్రామంలోని పలువురికి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో స్థానికులు ఇతడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ది చేసి.. పద్దతి మార్చుకోమని వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఇంత జరిగాక కూడా అతను తన దుర్భుద్ధిని మార్చుకోలేదు. మళ్లీ శనివారం బాల్ రెడ్డి అనే రైతు ఇంటి ఆవరణలో కట్టేసి ఉన్న గేదెపై అత్యాచారానికి యత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గేదె తోక మెడకు గట్టిగా బిగుసుకోవడం వల్ల ఉరి బిగుసుకోని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో అతను నగ్నంగా విగతజీవిగా పడి ఉన్నాడు. ఉదయం పశువుల కొట్టంలో ఆంజనేయులు విగత జీవిగా నగ్నంగా కనిపించడంతో బాల్ రెడ్డి ఆందోళనతో ఊర్లో వాళ్లకు విషయం తెలిపాడు. వారంతా కలిసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Also Read: పనివాడితో అత్తను హత్య చేయించిన కోడలు.. ఎందుకో తెలిస్తే షాక్

 ఏనుగులు బాబోయ్.. ఏనుగులు.. సిక్కోలు ప్రజలకు చుక్కలు చూపెడుతున్నాయి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu