AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramya Murder: గుంటూరు విద్యార్థిని రమ్యను హత్య చేసింది శశికృష్ణ..!.. వాగ్వాదం చేసిన కొద్దిసేపటికే హత్య

గుంటూరు నగరంలోని కాకాణి రోడ్డులో దారుణంగా దారుణ హత్యకు గురైన బిటెక్ విద్యార్థిని రమ్య ఉదంతంలో పోలీసుల దర్యాప్తు చకచకా

Ramya Murder: గుంటూరు విద్యార్థిని రమ్యను హత్య చేసింది శశికృష్ణ..!..  వాగ్వాదం చేసిన కొద్దిసేపటికే హత్య
Ramya Death
Venkata Narayana
|

Updated on: Aug 15, 2021 | 4:25 PM

Share

B.tech student Ramya Murder Case: గుంటూరు నగరంలోని కాకాణి రోడ్డులో దారుణంగా దారుణ హత్యకు గురైన బిటెక్ విద్యార్థిని రమ్య ఉదంతంలో పోలీసుల దర్యాప్తు చకచకా సాగుతోంది. రమ్యను హత్య చేసింది శశి కృష్ణగా పోలీసులు భావిస్తున్నారు. హత్య చేయడానికి ముందు ఎనిమిది నిమిషాలు రమ్యతో నిందితుడు శశికృష్ణ మాట్లాడినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడితో రమ్య వాగ్వివాదం చేసిన కొద్ది సేపటి తర్వాతే హత్య జరిగినట్టు తెలుస్తోంది. నిందితుడి ఆచూకీ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. రమ్య స్నేహితురాలు మౌనిక నుండి పోలీసులు పూర్తి వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది.

Ramya

Ramya

కాగా, ఈరోజు ఉదయం గుంటూరు నగరం కాకాణి రోడ్డులో ఓ దుండగుడు బీటెక్ చదువుతోన్న విద్యార్థిని రమ్యను కత్తితో పొడిచి చంపాడు. ఓ ప్రైవేట్‌ కళాశాలలో రమ్య మూడ సంవత్సరం బీటెక్ చదువుతోంది. ఒంటరిగా ఉన్న రమ్యను చూసి.. కత్తితో దాడిచేసి హతమర్చాడు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనలో నిందితుడి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఇది ఇలా ఉండగా.. రమ్య హత్య కేసులో బాధితురాలి సెల్ ఫోన్ కీలకంగా మారింది. రమ్య సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సెల్ ఫోన్ లాక్ ఓపెన్ చేశారు. తద్వారా కేసు దర్యాప్తు ముమ్మరమైంది.

స్వాతంత్ర్యం వచ్చిందని ఒక పక్క సంబరాలు చేసుకుంటున్నాం. ఓ వైపు మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంటే.. ఇంకోవైపు ఆడబిడ్డపై కత్తి దూశాడా ఉన్మాది. ఎందుకు.. ఏంటని..  ప్రశ్నించేలోపే నడిరోడ్డుపై కిరాతకంగా కడతేర్చాడు. ఈ అమానవీయ ఘటన తెలుగురాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేస్తోంది.

Read also: Kadiyam: ‘దళిత బంధు’ అమలు చేయకపోతే నష్టపోయేది మా పార్టీనే.. కడియం సంచలన వ్యాఖ్యలు