Hyderabad: తిన్నింటి వాసలు లెక్కపెట్టిన కొడుకు.. కన్న తండ్రిని మోసం చేసేందుకు టెక్నాలజీ వినియోగం..

Theft: సొంత ఇంటిలోనే దొంగతనానికి తెగబడ్డారు కొడుకు, కోడలు. ఈ షాకింగ్ సంఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. కరీంనగర్‌ రవి అనే వ్యక్తి హైదరాబాద్‌లో భార్యతో నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే..

Hyderabad: తిన్నింటి వాసలు లెక్కపెట్టిన కొడుకు.. కన్న తండ్రిని మోసం చేసేందుకు టెక్నాలజీ వినియోగం..
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 19, 2021 | 9:55 AM

Theft: సొంత ఇంటిలోనే దొంగతనానికి తెగబడ్డారు కొడుకు, కోడలు. ఈ షాకింగ్ సంఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. కరీంనగర్‌ రవి అనే వ్యక్తి హైదరాబాద్‌లో భార్యతో నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే కరీంనగర్‌లో ఉంటున్న తండ్రి వైకుంఠం ఆస్తిపై రవి చూపు పడింది. సొంత ఇంట్లోనే దొంగతనానికి స్కెచ్‌ వేశాడు. దీనికి అతని భార్య కూడా సహకరించింది. సొంతిటికి కన్నం వేసేందుకు రవి మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేశాడు.

కరీంనగర్‌లో ఉన్న తండ్రి ఆస్తి విషయాల గురించి ఇతరులతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకునేందుకు టెక్నాలజీని ఉపయోగించాడు. తండ్రికి ఎలాంటి అనుమానం రాకుండా అతని ఫోన్‌లో ఓ రికార్డింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేశాడు. ఆ యాప్‌లో రికార్డ్‌ అయినవి అయినట్లు మెయిల్‌కు వెళ్లేలా తన జీమెయిల్‌కు లింక్‌ చేసుకున్నాడు. దీంతో తండ్రి కరీంనగర్‌లో ఎవరితో ఫోన్‌లో మాట్లాడినా అది వెంటనే హైదరాబాద్‌లో ఉన్న రవికి తెలిసిపోయేది. ఇలా ఓ రోజు రవి తండ్రి వైకుంఠం.. ఇంట్లో ఉన్న డబ్బు ఆస్తి పత్రాల గురించి ఎవరితోనే ఫోన్‌లో మాట్లాడాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఇంటికి తాళం వేయగానే.. రవి, అతని భార్య ఇంటికి చేరుకున్నారు.

అదే అదునుగా భావించి ఇంట్లో ఉన్న రూ. 25 లక్షల నగదు, ఆస్తి పత్రాలను కాజేశారు. దీంతో అనుమానం వచ్చిన వైకుంఠం ఫోన్‌ను పరిశీలించగా అందులో ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌ గురించి తెలుసుకున్నాడు. విషయం తెలిసి ఒక్కసారి షాకై అయిన వైకుంఠం సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

Also Read: Batukamma-American police: బతుకమ్మ ఆడిన అమెరికా పోలీసులు.! బతుకమ్మ చుట్టూ తిరుగుతూ.. వైరల్‌ అవుతున్న వీడియో.!

Know This: వైన్‌తో నడిచే కారును మీరెప్పుడైనా చూశారా.? అయితే ఇప్పుడు చూడండి..(వీడియో)

Pooja Hegde: అప్పుడు సిగ్గు, ఇప్పుడేమో సినిమాలు.. ఇక ప్రేమకు సమయం ఎక్కడిది. బుట్టబొమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు..