Know This: వైన్‌తో నడిచే కారును మీరెప్పుడైనా చూశారా.? అయితే ఇప్పుడు చూడండి..(వీడియో)

కార్లకు ఇంధనంగా వాడేది డీజిల్‌ లేదా పెట్రోల్‌. ఆ తర్వాతి కాలంలో ఈ రెండు ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వచ్చింది సీఎన్‌జీ గ్యాస్‌. అయితే వాతావరణ కాలుష్యం తగ్గించే లక్ష్యంతో ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ కార్లు వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి ప్రభుత్వాలు.

Anil kumar poka

|

Oct 19, 2021 | 8:30 AM

కార్లకు ఇంధనంగా వాడేది డీజిల్‌ లేదా పెట్రోల్‌. ఆ తర్వాతి కాలంలో ఈ రెండు ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వచ్చింది సీఎన్‌జీ గ్యాస్‌. అయితే వాతావరణ కాలుష్యం తగ్గించే లక్ష్యంతో ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ కార్లు వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే బ్రిటీష్‌ రాజవంశానికి కాబోయే చక్రవర్తి ప్రిన్స్‌ చార్లెస్‌ పెట్రోలు , డీజిల్‌ బదులు వైన్‌తో కారు నడిపిస్తున్నారు. నమ్మడం లేదా.. స్వయంగా చార్లెస్‌ వెల్లడించిన తర్వాత వాస్తవం కాకుండా ఎలా ఉంటుంది?

ప్రిన్స్‌ ఛార్లెస్‌ తన 21వ ఏట ఆస్టన్‌ మార్టిన్‌ కారుని బహుమతిగా అందుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఈ యువరాజు గ్యారేజీలో మరెన్నో కార్లు వచ్చి చేరినా ఆ పాత ఆస్టోన్‌ మార్టిన్‌ కారు వన్నె తగ్గలేదు. యువరాజుకి దానిపై మోజు పోలేదు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా ఆ కారులో చక్కర్లు కొడుతూనే ఉంటారు.చార్జెస్‌ ఆజ్ఞలకు తగ్గట్టుగా కారుని రీ డిజైన్‌ చేశారు ఇంజనీర్లు. వారి కృషి ఫలించి ప్రస్తుతం కారు వైన్‌తో నడుస్తోంది. బకింగ్‌హామ్‌ ప్యాలేస్‌లో మిగిలిపోయిన వైన్‌ని ఈ కారు నడిపేందుకు ఉపయోగిస్తున్నారట. కొన్ని సార్లు విరిగిపోయిన పాలను సైతం ఈ కారులో ఫ్యూయల్‌గా వాడుతున్నారట. ఈ విషయాలను స్వయంగా ప్రిన్స్‌ ఛార్లెస్‌ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇటీవల వాతావరణ కాలుష్యంపై ప్రపంచ వ్యాప్తంగా గగ్గోలు పెడుతున్నా.. చార్లెస్‌ పెద్దగా స్పందిచకపోవడంతో ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి. దీంతో తనపై ఉన్న ముద్రను చెరిపేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందరిలా ఎలక్ట్రిక్‌ కార్లంటే రాయల్‌ రేంజ్‌ ఏముంటుంది అనుకున్నారో ఏమో? ‘గ్లోబల్‌ వార్మింగ్‌’ ప్రచారానికి ఊతం ఇచ్చేందుకు కర్బన ఉద్ఘారాలను వెదజల్లని వైన్‌ కారు ఫార్ములాను యువరాజు ఎంచుకున్నారు. అయితే రాజుగారి నిర్ణయంపై గ్లోబల్‌ లీడర్ల నుంచి పెద్దగా స్పందన లేకున్నా సోషల్‌ మీడియాలో ఫన్నీ మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి.


మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Tallest Woman Video: బ్రేకింగ్‌ రికార్డ్‌.. ప్రపంచంలోనే పొడవైన మహిళగా గిన్నిస్‌ రికార్డు… అసలు ఎత్తు ఎంతటే..?(వీడియో)

 

Manchu Vishnu: ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు అందలేదని క్లారిటీ ఇచ్చిన ‘మంచు విష్ణు’..(లైవ్ వీడియో)

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu