Chennai Airport: చెన్నై విమానాశ్రయంలో ఎర్రచందనం స్వాధీనం.. ఎక్స్‌పోర్ట్ కంపెనీ యజమాని అరెస్ట్
Red Wood seized: తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో 500 కిలోల ఎర్రచందనం దుంగలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం..
Red Wood seized: తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో 500 కిలోల ఎర్రచందనం దుంగలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్న ఓ సంస్థ యజమానిని అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. చెన్నై నుంచి సింగపూర్‌కు వెళుతున్న కార్గో విమానంలో ఎర్రచందనం దుంగలు అక్రమంగా తరలిస్తున్నట్టు విమానాశ్రయ అధికారులకు సమాచారం అందింది. దీంతో బుధవారం మధ్యాహ్నం పార్శిల్ కార్యాలయంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బెడ్ షీట్ల కింద దాచి ఉంచిన 500 కిలోల ఎర్రచందనం దుంగలను గుర్తించి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎర్రచందనం విలువ రూ.25 లక్షలుంటుందని అధికారులు పేర్కొన్నారు. అనంతరం ఎర్రచందనాన్ని బెడ్‌షీట్స్‌లో దాచి స్మగ్లింగ్ చేస్తున్న ఎక్స్‌పోర్ట్ కంపెనీ యజమానిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: