Road Accident: ఇంటికి వెళుతుండగా ప్రమాదం.. బైక్‌ను ఢికొన్న లారీ.. ఇద్దరు యువకులు మృతి
Road Accident at Shamirpet: లారీ ఢికొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన బుధవారం రాత్రి మేడ్చల్ జిల్లా షామిర్‌పేట పోలీస్‌స్టేషన్..
Road Accident at Shamirpet: లారీ ఢికొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన బుధవారం రాత్రి మేడ్చల్ జిల్లా షామిర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు ఇంటికి వెళుతుండగా ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్ రహదారిపై సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచ్చయ్యపల్లికి చెందిన నర్సింహ (35) మారేడు మల్లేశ్ (25) ద్విచక్రవాహనంపై తమ స్వగ్రామానికి వెళ్తున్నారు.
ఈ క్రమంలో షామీర్‌పేట మండలంలోని తుర్కపల్లి గ్రామ సమీపంలోని క్లాసిక్ దాబా వద్దకు చేరుకోగానే.. వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన ఇసుక లారీ వారి ద్విచవాహనాన్ని ఢీకొంది. దీంతో ఇద్దరు యువకులు కూడా అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: