పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న వాహనాలను ఢీకొన్న డీసీఎం.. ఇద్దరు మృతి
ఆగి ఉన్న ఇన్నోవా వాహనంతో పాటు మరో డీసీఎంను ఢీ కొట్టింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు.
ORR Accident : హైదరాబాద్ శివారు ప్రాంతం పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్.. ఆగి ఉన్న ఇన్నోవా వాహనంతో పాటు మరో డీసీఎంను ఢీ కొట్టింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై గల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో డీసీఎం వ్యాన్, ఇన్నోవా కారు ఆగి ఉన్నాయి. వేగంగా వచ్చిన డీసీఎం బలంగా ఢీకొట్టింది. దీంతో మూడు వాహనాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి… Road Accident: ఇంటికి వెళుతుండగా ప్రమాదం.. బైక్‌ను ఢికొన్న లారీ.. ఇద్దరు యువకులు మృతి