AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘట్‌కేసర్ ఘటనలో కొత్త ట్విస్ట్.. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా లోకేషన్ ట్రేస్.. పోలీసుల రాకతో నిందితుల జంప్

కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ బీఫార్మసీ విద్యార్థినిని ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి అఘాయిత్యాని యత్నించారు.

ఘట్‌కేసర్ ఘటనలో కొత్త ట్విస్ట్..  సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా లోకేషన్ ట్రేస్.. పోలీసుల రాకతో నిందితుల జంప్
Balaraju Goud
|

Updated on: Feb 11, 2021 | 8:36 AM

Share

Pharmacy student kidnap : హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది.. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ బీఫార్మసీ విద్యార్థినిని ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి అఘాయిత్యాని యత్నించారు. ఎదురించిన అమ్మాయిని గాయపర్చారు. ఈ ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం రాంపల్లికి చెందిన చెందిన అమ్మాయి కండ్లకోయలోని ఓ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతోంది. ఎప్పటిలాగానే కాలేజీకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో నాగారంలో బస్సు దిగి రాంపల్లిలోని ఆర్‌ఎల్‌ నగర్‌ బస్టాప్‌ వెళ్లేందుకు సెవన్‌ సీటర్‌ ఆటో ఎక్కింది. ఆమెతో పాటు తన సీనియర్, ఇద్దరు ప్యాసింజర్లు కూడా ఆటోలో ఉన్నారు. అయితే, కొద్ది దూరం వెళ్లాక ఆ ముగ్గురూ దిగిపోయారు.

ఆటోలో ఒంటరిగా ఉన్న అమ్మాయి చూసిన ఆటో డ్రైవర్ అలోచనలు పక్కదారి పట్టాయి. ఇదే అదనుగా భావించి ఆమె దిగాల్సిన చోట ఆపకుండా వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. అప్పటికే యామన్నపేట దగ్గర వేచి ఉన్న మరో వ్యాన్‌లోకి ఆటోలో నుంచి ఆమెను బలవంతంగా ఎక్కించారు. అక్కడి నుంచి ఘట్‌కేసర్‌ రైల్వే ట్రాక్‌ వద్దకు తీసుకెళ్లి.. ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించారు. అయితే, అటుగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం సైరన్‌ విన్పించడంతో అక్కడి నుంచి మకాం మార్చారు. ఘట్‌కేసర్‌ ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ చేంజ్‌ సర్వీసు రోడ్డుకు సమీపంలోని ఓ భవనం వద్దకు ఆమెను తీసుకెళ్లారు. అప్పటికీ పోలీసులు తమను వెంటాడుతున్నారని భావించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

ఇదిలావుంటే, దిగాల్సిన చోట ఆపకుండా ఆటోను తీసుకెళ్తున్న సమయంలోనే బాధితురాలు తన తల్లికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. వెంటనే అలెర్ట్‌ అయిన బాధితురాలి తల్లి తమ సమీప బంధువైన ఓ అబ్బాయికి ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పింది. దీంతో అతను డయల్‌ 100కు కాల్‌చేసి ఫిర్యాదు చేశాడు. అప్పటికప్పుడు కీసర, ఘట్‌కేసర్‌ పోలీసులు బృందాలుగా ఏర్పడి జల్లెడ పట్టారు. బాధితురాలి ఫోన్‌ నంబర్‌ లోకేషన్‌ను ఆధారంగా ట్రేస్‌ చేయడంతో చివరికి ఘట్‌కేసర్‌ సర్వీసు రోడ్డుకు సమీపంలో నిర్మాణం ఆగిపోయిన ఓ భవనం వద్ద చూపింది. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకోవడంతో నిందితులు తప్పించుకున్నారు.

ఆటో డ్రైవర్‌తో జరిగిన పెనుగులాటలో బాధితురాలి కుడికాలికి గాయమైంది. ఎట్టకేలకు రాత్రి 7:50 గంటల ప్రాంతంలో బాధితురాలి వద్దకు చేరుకున్న పోలీసులు వారి వాహనంలోనే జోడిమెట్లలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, కుడికాలికి మాత్రం గాయమైందని వైద్యులు తెలిపారు.

విషయం తెలుసుకున్న మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి, ఏసీపీ శ్యాం ప్రసాద్‌కుమార్‌ ఆస్పత్రికి చేరుకుని బాధితురాలిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆటోడ్రైవర్‌ను గుర్తించేందుకు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకున్నామని డీసీపీ రక్షితామూర్తి తెలిపారు.

Read Also…  పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న వాహనాలను ఢీకొన్న డీసీఎం.. ఇద్దరు మృతి

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!