Disha Case: ‘దిశ’ కేసులో కీలక మలుపు.. సంచలన ఆరోపణలు చేసిన నిందితుల కుటుంబ సభ్యులు.. అతనిపైనే అనుమానాలు అంటూ..

Disha Case: తెలంగాణలో 2019 నవంబర్‌లో చోటు చేసుకున్న ‘దిశ’ హత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన..

Disha Case: ‘దిశ’ కేసులో కీలక మలుపు.. సంచలన ఆరోపణలు చేసిన నిందితుల కుటుంబ సభ్యులు.. అతనిపైనే అనుమానాలు అంటూ..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 10, 2021 | 9:10 PM

Disha Case: తెలంగాణలో 2019 నవంబర్‌లో చోటు చేసుకున్న ‘దిశ’ హత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ‘దిశ’పై హత్యాచారానికి పాల్పడి.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఇదే అంశమై ‘దిశ’ కమిషన్‌ను ఆశ్రయించిన నిందితుల కుటుంబ సభ్యులు.. తమకు ప్రాణ హాణి ఉందంటూ ఫిర్యాదు చేశారు. హైకోర్టులో కేసును వెనక్కి తీసుకోవాలంటూ కొందరు తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. నలుగురు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య యాక్సిడెంట్ కేసులో తమకు అనుమానాలు ఉన్నాయన్నారు.

అంతేకాదు.. దిశ హత్యాచారం కేసులో లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డిపై అనుమానం ఉందని, ఆయన్ని పోలీసులు విచారించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు ‘దిశ’ కమిషన్‌ను కోరారు. నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి వారి కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలంటూ కొంతకాలంగా వారిని పలువురు వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. కేసు వెనక్కి తీసుకుంటే రూ. 25 లక్షలు ఇస్తామని ప్రలోభాలకు గురిచేస్తున్నారని చెప్పారు. ఈ కేసులో తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, కీలక విషయాలు బయటపెడతామంటూ ప్రకటించారు. అయితే వీరు చేసిన తాజా ఆరోపణలతో ‘దిశ’ కేసు మరో మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇదిలాఉండగా, 2019, నవంబర్ 27వ తేదీన శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్ ప్లాజా సమీపంలో వెటర్నరీ డాక్టర్ ‌అయిన దిశపై ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు దారుణంగా అత్యాచారం చేసి, ఆపై షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద సజీవదహనం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులు పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. అదలాఉంటే.. చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ కుర్మయ్య చనిపోయాడు.

Also read:

Rail Roko on Feb 18: పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తోన్న రైతన్నలు .. ఈనెల 18 న రైలు రోకోకు పిలుపు

ప్రధాన మంత్రిగా ఉండి కూడా కారు కోసం లోన్ తీసుకున్న లాల్ బహదూర్ శాస్త్రి.. ఆ లోన్ తీర్చకుండానే మృతి.. ఆపై