జర్నలిస్ట్ ప్రియా రమణిపై కేంద్ర మాజీ మంత్రి ఎం.జె.అక్బర్ కేసు, తీర్పును ఈ నెల 17 కి వాయిదా వేసిన ఢిల్లీ కోర్టు

జర్నలిస్టు ప్రియా రమణిపై మాజీ కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్ దాఖలు చేసిన క్రిమినల్ డిఫమేషన్ కేసు (పరువునష్టం దావా) పై తీర్పును ఢిల్లీ కోర్టు ఈ నెల 17 కి వాయిదా వేసింది.

జర్నలిస్ట్ ప్రియా రమణిపై కేంద్ర మాజీ మంత్రి ఎం.జె.అక్బర్ కేసు, తీర్పును ఈ నెల 17 కి వాయిదా వేసిన ఢిల్లీ కోర్టు
Umakanth Rao

| Edited By: Ravi Kiran

Feb 10, 2021 | 5:08 PM

జర్నలిస్టు ప్రియా రమణిపై కేంద్ర మాజీ మంత్రి ఎం.జె.అక్బర్ దాఖలు చేసిన క్రిమినల్ డిఫమేషన్ కేసు (పరువునష్టం దావా) పై తీర్పును ఢిల్లీ కోర్టు ఈ నెల 17 కి వాయిదా వేసింది. అక్బర్ తనను లైంగికంగా వేధించారని ప్రియా రమణి ఆరోపిస్తూ..ఆయనపై లోగడ కేసు పెట్టడం, ఈ ఆరోణలను ఆయన నిరాధారమైనవిగా పేర్కొంటూ ఆమెపై పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. వీరిద్దరి వాదనలు ఆలకించిన అనంతరం అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీందర్ కుమార్ తన తీర్పును ఈనెల 1 న రిజర్వ్ లో ఉంచారు. కాగా బుధవారం ఈ కేసును విచారించిన కోర్టు.. వీరు లిఖితపూర్వక వాదనలను ఆలస్యంగా సమర్పించారని పేర్కొంది. ఉభయ పక్షాల నుంచి ఈ సబ్ మిషన్లు అందడంలో జాప్యం జరిగినందున ఈ నెల 17 న తీర్పు ప్రకటిస్తామని తెలిపింది.

2018 లో మీ టూ ఉద్యమ నేపథ్యంలో అక్బర్ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని, లైంగికంగా వేధించారని జర్నలిస్ట్ ప్రియా రమణి ఆయనపై పిటిషన్ వేశారు. అయితే ఈ ఆరోపణలు నిరాధారమైనవని, తన పరువుకు భంగం కలిగించేందుకే ఆమె ఈ నింద వేస్తోందని అంటూ అక్బర్ కూడా ఆమెపై కేసు పెట్టారు. 2018 అక్టోబర్ 15 న ఆయన పరువు నష్టం దావా వేశారు. అదే ఏడాది అదే నెల 17 న ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

నాడు మీ టూ ఉద్యమం ప్రబలంగా ఉన్నప్పుడు కొందరు  మహిళలు కూడా అక్బర్ పట్ల ఆరోపణలు చేశారు. కాగా బుధవారం ఉదయం అక్బర్, రమణి తమ లాయర్లతో కోర్టుకు చేరుకున్నారు. అక్బర్ తరఫున సీనియర్ న్యాయవాది గీతా లూథ్రా, ప్రియా రమణి తరఫున రెబెకా జాన్ వాదిస్తున్నారు. రెండేళ్ల క్రితం రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. నాడు అక్బర్ పేరును నేరుగా ప్రస్తావించకుండా రమణి  ఓ ఆర్టికల్ రాశారు. అక్బర్  ఇంటర్వ్యూ కోసం ఓ  హోటల్ కి తాను వెళ్ళినప్పుడు ఆయన తనను లైంగికంగా వేధించారని ఆమె ఈ ఆర్టికల్ లోపేర్కొంది. అప్పుడు అక్బర్ ఓ నేషనల్ డైలీకి ఎడిటర్ గా ఉన్నారు. కాగా- అక్బర్ ను ఉద్దేశించే ఈ ఆర్టికల్ రాశానని రమణి ఆ తరువాత ట్వీట్ చేసింది.

Read More:ఉత్తరాఖండ్ విషాదం, ఇస్రో తీసిన ఇమేజీల్లో కళ్ళకు కట్టిన ప్రకృతి విలయం, అదే బీభత్సం .

Read More: ‘క్రోనీ జీవీ హై వో’, ‘దేశాన్నే వాళ్లు అమ్మేస్తున్నారు’, ప్రధాని మోదీ వ్యాఖ్యపై రాహుల్ గాంధీ ఫైర్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu