Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Crime News: హైద‌రాబాద్‌లో వ్యాక్సిన్ దొంగ‌లు.. 500 డోస్‌లు మాయం చేశారు..

దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత వెంటాడుతోంది. ఓ వైపు మొదటి డోసు వేసుకున్నవారు.. రెండో డోసు కోసం ఎదురుచూస్తుండగా, అసలు మొదటి డోసు కూడా....

Hyderabad Crime News: హైద‌రాబాద్‌లో వ్యాక్సిన్ దొంగ‌లు.. 500 డోస్‌లు మాయం చేశారు..
Covishield Vaccine
Follow us
Ram Naramaneni

|

Updated on: May 22, 2021 | 2:42 PM

దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత వెంటాడుతోంది. ఓ వైపు మొదటి డోసు వేసుకున్నవారు.. రెండో డోసు కోసం ఎదురుచూస్తుండగా, అసలు మొదటి డోసు కూడా దొరక్క అవస్థ పడుతున్నవారు చాలామంది ఉన్నారు. ఇదిలా ఉండగానే… సందట్లో సడేమియా లాగా అడుగు, బొడుగు ఉన్న వ్యాక్సిన్లమీద ఇంటిదొంగలు చేతివాటం చూపిస్తున్నారు. వ్యాక్సిన్లకు సరైన భద్రత కల్పించలేకపోవడంతో 500 డోసుల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ మాయమయ్యాయి. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలోనో కాదు..ఏకంగా హైదరాబాద్‌లోని కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో వ్యాక్సిన్లు మాయం కావటం కలకలం రేపుతోంది. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో డెలివరీ వార్డులోని ఓ గదిలో ఈ వ్యాక్సిన్లను భద్రపరిచారు. ఇటీవల ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు విరామం ప్రకటించడంతో మిగిలిన వ్యాక్సిన్లను అదే గదిలో భద్రపరిచారు. మే 19న ఆ గదిని తెరిచి చూడగా కోవిషీల్డ్‌ 50 వయల్స్ అంటే 500 డోసుల బాక్సు కనిపించలేదు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వెంటనే గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, పోలీసులు ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను సేక‌రించి.. దర్యాప్తు జ‌రుపుతున్నారు. ఇంటి దొంగ‌లపై అనుమానాలు రావ‌డంతో వారిపై ఫోక‌స్ పెట్టారు.

త్వ‌ర‌లో పిల్లలకు వ్యాక్సిన్‌…!

థర్డ్‌వేవ్‌ అధిక ప్రభావం పిల్లలపైనే చూపనుందని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని ఢిల్లీలోని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా చెప్పారు. పిల్లలకు వైరస్ వ్యాప్తి చెందే అవ‌కాశం సహజంగానే తక్కువగా ఉన్నందున థర్డ్‌వేవ్‌లోనూ వారికి పెద్దగా డేంజ‌ర్ ఉండబోదని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ పిల్లల రక్షణకు చర్యలు చేపడుతున్నట్టు వివ‌రించారు. పిల్లలపై వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయని.. వచ్చే మూడు నాలుగు నెలల్లో టీకాలకు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చే అవకాశం ఉంద‌న్నారు.

Also Read:  రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. మరికొన్ని రైళ్లు రద్దు.. వివరాలివే..

సమస్య ఎడమకాలికైతే.. కుడికాలును తీసేసిన డాక్టర్లు!