SHOCKING: సమస్య ఎడమకాలికైతే.. కుడికాలును తీసేసిన డాక్టర్లు!

డాక్టర్లు చేసిన తప్పిదానికి అన్యాయంగా కాలు పోగొట్టుకున్నాడో పేషెంట్. 82 ఏళ్ల ఓ పెద్దాయన ఫ్రిస్టాడ్ అనే క్లినిక్ కు వచ్చి.. కాళ్ల నొప్పితో చాలా బాధపడుతున్నానని...

SHOCKING: సమస్య ఎడమకాలికైతే.. కుడికాలును తీసేసిన డాక్టర్లు!
Doctors Operate On Wrong Le
Follow us

|

Updated on: May 23, 2021 | 10:42 AM

డాక్టర్లు చేసిన తప్పిదానికి అన్యాయంగా కాలు పోగొట్టుకున్నాడో పేషెంట్. 82 ఏళ్ల ఓ పెద్దాయన ఫ్రిస్టాడ్ అనే క్లినిక్ కు వచ్చి.. కాళ్ల నొప్పితో చాలా బాధపడుతున్నానని తనకు మంచి ట్రీట్మెంట్ అందించి.. ఆ బాధ నుంచి త్వరగా విముక్తి కలిగించాలని అక్కడి డాక్టర్లను కోరాడు. దాంతో పెద్దాయన కాళ్లను పరిశీలించిన డాక్టర్లు.. ఎడమకాలికి ఇన్ఫెక్షన్ ఎక్కువగా పాకిందని..ఇప్పటికే చాలా ఆలస్యమైందంటూ వెంటనే ఆ కాలిని తొలగించాలని చెప్పారు. అధిక నొప్పితో బాధపడుతున్న ఆ పెద్దాయన దానికి ఒప్పుకుని కాలిని తీసేయించుకున్నాడు. సీన్‌ కట్‌ చేస్తే.. ఆ తర్వాతి రోజు పేషంట్‌కు బ్యాండేజ్‌ మార్చుతుండగా అసలు విషయం బయటకొచ్చింది. పేషంట్‌ ఎడమకాలిని తొలగించాల్సిన డాక్టర్లు.. కుడికాలిని తొలగించినట్లు తెలిసింది. ఆ పెద్దాయన కూడా తీవ్ర అనారోగ్యం కారణంగా సమస్యను ముందుగా గుర్తించలేకపోయాడు. ఆ తర్వాత తన చుట్టుపక్కలవారు విషయం చెప్పడంతో నిజం తెలుసుకుని షాక్‌ అయ్యాడు.

కాగా దీనిపై స్పందించిన ఆ క్లినిక్‌ మెడికల్‌ డైరెక్టర్‌ బహిరంగంగా క్షమాపణ చెబుతూ.. ఇది పొరపాటున జరిగిన‌ ఫెయిల్యూర్‌గా భావిస్తున్నామని అన్నారు. దురదృష్టవశాత్తు ఎడమ కాలికి బదులు కుడి కాలు తీసేశామని.. ఆ తప్పు ఎలా జరిగిందో తెలుసుకుని చర్యలు తీసుకుంటామని వెల్లడించాడు. ఇదిలావుంటే సర్జరీకి ముందు మార్క్‌ చేయడంలో తప్పు జరిగి ఉండొచ్చని అక్కడి వెద్యులు అంటున్నారు. అలాగే ప్రస్తుతం ఆ పెద్దాయనకు మరోసారి సర్జరీ చేసి సమస్య ఉన్న కాలిని తొలగించాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న ఆస్ట్రేలియాలో జ‌రిగింది.

Also Read: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. మరికొన్ని రైళ్లు రద్దు.. వివరాలివే..

తెలంగాణ ఒక గొప్ప చిత్రకారున్ని, గాయకుడ్ని కోల్పోయింది : ముఖ్యమంత్రి కేసీఆర్