ఇది రాక్షస కీచకపర్వం.. మహా దారుణం.. ఎక్కడ..?

ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎన్ని శిక్షలు వేసినా.. ఎంతమంది అవగాహన కల్పించినా.. ఆడపిల్లలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. చిన్న, పెద్ద, ముసలి తేడా లేకుండా.. దేశంలో రోజూ ఏదో ఒక మూల రెచ్చిపోతూనే ఉన్నారు కామాంధులు. ‘ఆమె’పై బలత్కారం చేయడమే కాకుండా.. దారుణంగా చంపేస్తూ మృగాలకు అతీతంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ మూడేళ్ల అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేసి.. హింసించి.. తల నరికారు కొందరు రాక్షసులు. ఈ దారుణమైన ఘటన జంషెడ్‌పూర్‌లో జరిగింది. […]

  • Publish Date - 1:43 pm, Thu, 1 August 19 Edited By:
ఇది రాక్షస కీచకపర్వం.. మహా దారుణం.. ఎక్కడ..?

ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎన్ని శిక్షలు వేసినా.. ఎంతమంది అవగాహన కల్పించినా.. ఆడపిల్లలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. చిన్న, పెద్ద, ముసలి తేడా లేకుండా.. దేశంలో రోజూ ఏదో ఒక మూల రెచ్చిపోతూనే ఉన్నారు కామాంధులు. ‘ఆమె’పై బలత్కారం చేయడమే కాకుండా.. దారుణంగా చంపేస్తూ మృగాలకు అతీతంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ మూడేళ్ల అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేసి.. హింసించి.. తల నరికారు కొందరు రాక్షసులు. ఈ దారుణమైన ఘటన జంషెడ్‌పూర్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ టాటానగర్‌ రైల్వేస్టేషన్‌లో జూలై 25న రైల్వే ఫ్లాట్‌ఫాంపై ఓ తల్లి, ఆమె కుమార్తె నిద్రిస్తున్నారు. అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆ తరువాత ఆ చిన్నారిని అత్యాచారం చేసి దారుణంగా హతమార్చాడు. తలను మొండం నుంచి వేరుచేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. దీనికి అతడి స్నేహితులు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. ఉదయం నిద్రలేచిన తల్లికి బిడ్డ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికింది. అయినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఓ వ్యక్తి చిన్నారిని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించి పాప మృతదేహాన్ని కనుగొన్నారు. కేవలం మొండెం మాత్రమే దొరకడంతో తల కోసం ఆ ప్రాంతంలో గాలించినా ఫలితం లేకుండా పోయింది. పాప జననాంగాలపై గాయాలు, రక్తపు మరకలు ఉండటంతో చిన్నారిపై అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పోలీసులు పంపారు. అయితే తాను చిన్నారిని చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాకు అమ్మానని, హత్య చేయలేదని అంటున్నాడు. ఇదిలా ఉంటే ఆ చిన్నారిని తీసుకెళ్లిన వ్యక్తిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి.