AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccine: కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి..!

Covid Vaccine: కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు వ్యాక్సీన్ వేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, కరోనా టీకా...

Covid Vaccine: కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి..!
Covid Vaccine
Shiva Prajapati
|

Updated on: May 29, 2021 | 12:00 AM

Share

Covid Vaccine: కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు వ్యాక్సీన్ వేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, కరోనా టీకా వేసుకున్నాక కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దురలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. మరి ఆ చెడు అలవాట్లు ఏంటో ఒకసారి చూద్దాం..

ధూమపానం.. వ్యాక్సీన్ తీసుకున్న వారు ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. ధూమపానం వల్ల ఉపిరితిత్తులకు ఇబ్బంది కలిగించే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది.

ప్రాసెస్‌డ్ ఫుడ్(జంక్ ఫుడ్స్).. వ్యాక్సిన్ తీసుకున్నాక ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. అదే ప్రాసెస్‌డ్ ఫుడ్స్ తీసుకుంటే.. అందులో ఉండే అధిక క్యాలరీలు, సంతృప్త కొవ్వులు రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌ను తట్టుకునే శక్తి క్షీణిస్తుంది. అందుకే ప్రాసెస్‌డ్ ఫుడ్ బదులు అధిక ఫైబర్ ఉండే గోధుమలను ఆహారంగా తీసుకోవడం మంచిది.

ఆల్కహాల్‌, కెఫిన్ పానీయాలు( కాఫీ,టీ).. ఆల్కహాల్ సేవించే వారు టీకా తీసుకోవడానికి కొన్ని వారాల ముందు నుంచి, తీసుకున్న తర్వాత కొన్ని రోజుల వరకు మందు తాగకపోవడమే మంచిది. ఎందుకంటే టీకా తీసుకున్న తర్వాత శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఆల్కహాల్‌ డ్రింక్ చేస్తే శరీరం తొందరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇమ్యూనిటీ తగ్గిపోతే.. సైడ్ ఎఫెక్ట్స్‌ను ఎదుర్కొనే శక్తి తగ్గిపోతుంది.

చక్కెర పదార్థాలు.. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు, తీసుకున్న తర్వాత విశ్రాంతి చాలా అవసరం. ఎంత ఎక్కువ నిద్రపోతే అంత చురుగ్గా ఉంటాం. ఈ సమయంలో సంతృప్త కొవ్వులు, చక్కెరస్థాయులు ఎక్కువ ఉన్న ఆహారాన్ని దూరం పెట్టాలి. ఎందుకంటే చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఒత్తిడి, యాంగ్జైటీ పెరిగిపోతుంది. దీంతో నిద్ర సరిగ్గా పట్టక.. సరైన విశ్రాంతి ఉండదు. వీలైనంత వరకు అధిక ఫైబర్ ఉండే ఆహారమే తీసుకోవాలి. అలాగే, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జ్వరం, ఒళ్లు నొప్పులు వచ్చినప్పుడు.. వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుల సూచనల మేరకు మెడిసిన్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్‌ని తగ్గించుకోవచ్చు. మీ లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటే, లేదా వారం కన్నా ఎక్కువకాలం ఈ లక్షణాలు ఉంటే, మీకు టీకా ఇచ్చిన ఆరోగ్య కార్యకర్తకు సమాచారం అందించాలి. లేదా సమీప ఆసుపత్రిని సందర్శించాలి.

Also read:

MS Dhoni Pampers Horse: గుర్రానికి మసాజ్ చేస్తున్న ఎం ఎస్ ధోనీ..వైరల్‌గా మారిన వీడియో