Corona Spread: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ మధ్య వ్యత్యాసాలు.. ఐసీఎంఆర్ నివేదికలో ఆసక్తికర అంశాలు..

Corona Spread: దేశంలో కరోనా వైరస్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ మధ్య వ్యత్యాసాలును వివరిస్తూ ఐసీఎంఆర్ విడుదల చేసిన నివేదికలు ఆసక్తిని రేపుతున్నాయి.

Corona Spread: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ మధ్య వ్యత్యాసాలు.. ఐసీఎంఆర్ నివేదికలో ఆసక్తికర అంశాలు..
Corona
Follow us
Shiva Prajapati

|

Updated on: May 29, 2021 | 12:09 AM

Corona Spread: దేశంలో కరోనా వైరస్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ మధ్య వ్యత్యాసాలును వివరిస్తూ ఐసీఎంఆర్ విడుదల చేసిన నివేదికలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ నివేదికలో ఎన్నో కీలక, ఆసక్తికర అంశాలు ఉన్నాయి. దేశంలో కరోనా ఫస్ట్ వేవ్ కాలంలో కనిపించని సెకండరీ ఇన్‌ఫెక్షన్లు(బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్) సెకండ్ వేవ్‌లో చాలా కనిపిస్తున్నాయని ఈ నివేదికలో పేర్కొన్నారు. సెకండ్ వేవ్‌లో చాలా మంది బాధితులు సెకండరీ ఇన్‌ఫెక్షన్ల బారిన పడినట్లు వెల్లడించింది.

కరోనా ఫస్ట్ వేవ్ లో కొవిడ్-19 బారిన పడి ఆసుపత్రుల్లో చేరిన వారిలో బ్లాక్ ఫంగస్(మ్యుకోర్ మైకోసిస్) సోకిన ఆనవాళ్లు లేవని ఐసీఎంఆర్ తేల్చి చెప్పింది. గత ఏడాది జూన్- ఆగస్ట్ మధ్య దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 10 ఆసుపత్రుల్లోని మొత్తం 17, 534 పేషెంట్ల నుంచి సేకరించిన నమూనాలను ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు పరిశీలించారు. సెప్టెంబర్-నవంబర్ 2020 కాలంలో 7,600 మంది రోగులపై ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. ఐసీఎంఆర్ రెండో సర్వే మార్చి-ఏప్రిల్ 2021 కాలంలో 1,855 మంది పేషెంట్లపై జరిపింది. ఈ మూడు అధ్యయనాల నివేదికలు ఫస్ట్, సెకండ్ వేవ్ ల కాలంలో రోగుల్లో కలిగిన మార్పులు, చికిత్స, ఔషధాల వినియోగం, ఇన్ఫెక్షన్ల తీరును వెల్లడించాయి. ఈ అధ్యయన ఫలితాలు, పరిశీలనల వివరాలను డాక్టర్ కామిని వాలియా వెల్లడించారు.

ఫస్ట్ వేవ్ కాలంలో అదే ఆసుపత్రుల్లో చేరిన కొవిడ్ రోగుల్లో బ్లాక్ ఫంగస్ ఆనవాళ్లు లేవని, బాక్టీరియల్, ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు అధ్యయనకారులు తెలిపారు. ఫస్ట్ వేవ్ టైమ్‌లో ఆసుపత్రిలో చేరిన కొవిడ్ పేషెంట్లలో సెకండరీ ఇన్ఫెక్షన్లు(బాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు) భారిన పడ్డ వారి శాతం 3.6 శాతం అని పేర్కొంది. వీరిలో ఈ ఇన్ఫెక్షన్లతో మరణించే వారి శాతం 56.7శాతం అని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేరిన ఇతర రోగుల్లో మరణాల శాతం 10.6శాతమే అని వెల్లడించారు. సర్వే జరిపిన 10 ఆసుపత్రుల్లో ఒక ఆసుపత్రిలో అత్యధికంగా సెకండరీ ఇన్ఫెక్షన్ల బారిన పడి మరణించిన వారు 78.9శాతం అని ఐసీఎంఆర్ తెలిపింది.

ఆసుపత్రుల్లో చేరిన తర్వాతే 78 శాతం మంది కొవిడ్ రోగుల్లో ఈ సెకండరీ ఇన్ఫెక్షన్లు వచ్చాయని వెల్లడించారు. ఆసుపత్రిలో చేరిన రెండు రోజుల తర్వాత ఇన్ఫెక్షన్లు సోకాయని సదరు నివేదికల్లో శాస్త్రవేత్తలు తెలిపారు. చాలా నమూనాల్లో ‘గ్రామ్ నెగెటివ్ బాక్టీరియా'( తమలో ఒక లక్షణాన్ని కోల్పోయి ప్రమాదకరంగా పరిణమించిన బాక్టీరియా) కనిపించిందని వెల్లడించారు. ఈ బాక్టీరియా ఆసుపత్రుల్లో అభివృద్ధి చెందిందని శాస్తవ్రేత్తలు పేర్కొన్నారు. ఇది సోకడానికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటమే కారణం అన్నారు. దాదాపుగా 47శాతం ఇన్ఫెక్షన్లు మల్టీ డ్రగ్స్( పలు రకాలు మందులు) లొంగని శక్తిని కలిగివుంటాయన్నారు. ఇదిలాఉంటే.. కొవిడ్ నుంచి బయటపడిన అనంతరం చికిత్స కష్టతరమవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆంటి బయోటిక్స్ ఎక్కువగా వాడితే తీవ్ర పరిణామాలు ఏర్పడతాయని హెచ్చరించారు.

కాగా, ఆంటిబయోటిక్ మందులను ప్రపంచ ఆరోగ్య సంస్థ మూడు రకాలుగా వర్గీకరించింది. 1.సాధారణ డ్రగ్స్.. ఇవి బాక్టీరియాను ఎదుర్కొనేందుకు తక్కువ నిరోధక శక్తి కలిగినవి. 2.వాచ్ డ్రగ్స్..అధిక నిరోధక శక్తి కలిగినవి. క్రిటికల్ చికిత్సలో వాడతారు. 3.రిజర్వ్ డ్రగ్స్.. లొంగని బాక్టీరియాను నిరోధించడాని చివరి ఆయుధంగా ఒకసారి మాత్రమే వాడతారు.

అధ్యయనం చేసిన ఆసుపత్రుల్లో.. సెకండరీ ఇన్ఫెక్షన్ సోకిన కొవిడ్ రోగుల చికిత్సలో 74.4 శాతం వాచ్ డ్రగ్స్, రిజర్వ్ డ్రగ్స్ కేటగిరీకి చెందిన ఆంటిబయోటిక్స్ వాడారని శాస్త్రేవేత్తలు వెల్లడించారు. అధిక స్థాయిలో ఆంటిబయోటిక్స్ వాడటంతో ఈ మందులను సవాల్ చేసే శక్తి బాక్టీరియాకు పెరిగిందని అధ్యయనకారులు సదరు నివేదికలో వెల్లడించారు. బాక్టీరియా తన జన్యువులను మార్చుకుందని శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

ఫస్ట్ వేవ్.. సెకండ్ వేవ్ తేడాలు.. ఫస్ట్ వేవ్ లో సెకండరీ ఇన్ఫెక్షన్లు అతి తక్కువగా ఉన్నాయని ఐసీఎంఆర్ అధ్యయనకారులు, శాస్త్రవేత్తలు వెల్లడించారు. అప్పుడు బ్లాక్ ఫంగస్ లేదన్నారు. కొవిడ్ చికిత్సలో అధిక మొత్తంలో స్టెరాయిడ్స్ వాడటం వల్ల బ్లాక్ ఫంగస్ బారినపడిన బాధితుల సంఖ్య పెరుగుతోందన్నారు. కొవిడ్ బాధితుల్లో రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం, ఇతర రుగ్మతలను కలిగివుండటంతో బ్లాక్ ఫంగస్.. తదితర ఇన్ఫెక్షన్లకు గురయ్యే సంభావ్యత పెరిగిందన్నారు.

సెకండ్ వేవ్ లలో 70శాతానికి పైగా కొవిడ్ రోగుల్లో 40 ఏళ్ల పైబడ్డ వారే ఇన్ఫెక్షన్ కు గురవుతున్నారని వెల్లడించారు. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం.. ఫస్ట్ వేవ్ లో 31శాతం రోగులు 30 ఏళ్ల కంటే తక్కువ వారని పేర్కొన్నారు. సెకండ్ వేవ్‌లో 30 ఏళ్ల కంటే తక్కువ ఉన్న రోగులు 32 శాతం పెరిగారన్నారు. ఫస్ట్ వేవ్ లో ఆక్సిజన్ అవసరమైన రోగులు 41.5శాతం మాత్రమే కాగా.. సెకండ్ వేవ్‌లో మాత్రం ఆక్సిజన్ అవసరమైన రోగులు 54.5శాతం అని వెల్లడించారు. ఫస్ట్ వేవ్ లో మెకానికల్ వెంటిలేటర్ అవసరమైన రోగులు 37.3శాతం అయితే, సెకండ్ వేవ్‌లో మెకానికల్ వెంటిలేటర్ అవసరమైన రోగులు 27.8శాతం. ఫస్ట్ వేవ్ లో లక్షణాల తీవ్రతతో పోలిస్తే.. సెకండ్ వేవ్‌లో దగ్గు, గొంతుమంట.. తదితర లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని ఐసీఎంఆర్ నివేదికలో పేర్కొన్నారు.

Also read:

Green India Challeng: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతం.. ఎంపీ సంతోష్‌ను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!