బ్రేకింగ్.. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి మొదలుకొని.. ప్రజాప్రతినిధుల వరకు అందరు కూడా దీని బారిన పడుతున్నారు. తాజాగా వైసీపీ..
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి మొదలుకొని.. ప్రజాప్రతినిధుల వరకు అందరు కూడా దీని బారిన పడుతున్నారు. తాజాగా వైసీపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అంబటి రాంబాబుకు కరోనా టెస్టు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. తాజాగా అంబటి రాంబాబుతో ఆ సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తిన శివ కుమార్ కరోనా బారినపడ్డారు. అయితే వీరిలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య పూర్తిగా కోలుకున్నారు. ఇక తెనాలికి చెందిన ఎమ్మెల్యే శివ కుమార్ హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు.