WHO on Coronacases: ఒక్క వారంలోనే 2 కోట్లకు పైగా కొత్త కేసులు.. ఆ 4 దేశాల్లో కరోనా ఉధృతి.. WHO ఆందోళన!
World Health Organisation: ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది కొత్త వేరియంట్ ఒమిక్రాన్. ఒక్క వారం. ఒక్కటే ఒక్క వారం. కోట్లలో కొత్త కేసులు. దీన్ని బట్టి చూస్తే అర్థం అవుతోంది
WHO on Record weekly COVID-19 Cases: ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron Variant). ఒక్క వారం. ఒక్కటే ఒక్క వారం. కోట్లలో కొత్త కేసులు. దీన్ని బట్టి చూస్తే అర్థం అవుతోంది, కరోనా వైరస్(Coronavirus) ఎంతలా విజృంభిస్తోందో. అందుకే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ కొవిడ్ నిబంధనలు పాటించాలని వైద్య నిపుణులు చూస్తున్నారు. కరోనా ప్రభావంతో ఇప్పటికే చాలా దేశాలు అల్లాడిపోతున్నాయి. ఆస్పత్రులు వైరస్ బాధితులతో రద్దీగా మారాయి. కేవలం ఒక్క వారంలోనే 2 కోట్లపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. జనవరి 17 నుంచి 23 వరకు ప్రపంచ వ్యాప్తంగా 2.1 కోట్లుకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారంతో పోలిస్తే కేసుల్లో ఐదు శాతం పెరుగుదల కనిపించిందని వెల్లడించింది WHO.
వారం వ్యవధిలో ఈ స్థాయిలో కొవిడ్ కేసులు వెలుగుచూడటంపై ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కేసులు సంగతి అలా ఉంటే, అదే వారంలో దాదాపు 50 వేల మరణాలు నమోదయ్యాయి. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు వైరస్ పంజా ఎలా ఉందో. మొత్తంగా జనవరి 23 వరకు 34 కోట్లకు పైగా కేసులు, 55 లక్షలకు పైగా మరణాలు సంభవించాయని తెలిపింది WHO. అయితే, గతవారం నమోదైన కేసుల్లో రెండు కోట్ల కేసుల్లో, అమెరికా, ఫ్రాన్స్, భారత్, ఇటలీ, బ్రెజిల్ దేశాల వాటానే ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ఇక, మరోవైపు మరణాల విషయానికొస్తే, అమెరికా, రష్యా, భారత్, ఇటలీ, యూకే దేశాలు అగ్రభాగాన ఉన్నాయి. అంతర్జాతీయంగా ఒమిక్రాన్ వేరియంట్ డామినెంట్‌గా మారుతోందని ఆందోళన వ్యక్తం చేసింది WHO. ఈ వేరియంట్ కారణంగా నవంబర్, డిసెంబర్ మాసాల్లో భారీ స్థాయిలో కేసులు వెలుగులోకి వచ్చాయని, ఇప్పుడు ఆ దేశాల్లో తగ్గుదల ప్రారంభమైందని తెలిపింది. ఐరోపా దేశాల్లో దాని ప్రభావం తీవ్రంగా కనిపించిందని WHO చెప్పింది.
Read Also…. Covid Vaccine: కరోనా నియంత్రణలో మరో గుడ్‌న్యూస్.. త్వరలో రెగ్యులర్ మార్కెట్‌లోకి కొవిడ్ వ్యాక్సిన్‌లు!