కరోనాపై ‘చల్లబడిన’ ట్రంప్…మాస్కులు ధరించాలని అమెరికన్లకు పిలుపు

కరోనా వైరస్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 'చల్లబడ్డారు'. దేశంలో కరోనా వైరస్ పరిస్థితి మెరుగు పడేముందు దీని తీవ్రత మరింత పెరగవచ్చునని ఆయన హెచ్చరించారు.అమెరికాలో కొన్ని చోట్ల పరిస్థితి మెరుగు పడినా మరికొన్ని చోట్ల..

కరోనాపై 'చల్లబడిన' ట్రంప్...మాస్కులు ధరించాలని అమెరికన్లకు పిలుపు
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 22, 2020 | 3:20 PM

కరోనా వైరస్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘చల్లబడ్డారు’. దేశంలో కరోనా వైరస్ పరిస్థితి మెరుగు పడేముందు దీని తీవ్రత మరింత పెరగవచ్చునని ఆయన హెచ్చరించారు.అమెరికాలో కొన్ని చోట్ల పరిస్థితి మెరుగు పడినా మరికొన్ని చోట్ల తీవ్రంగా ఉందన్నారు. కోవిడ్-19 పై మళ్ళీ వైట్ హౌస్ లో మీడియాకు  బ్రీఫింగ్ ఇచ్చిన ఆయన.. ఈ వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజలు ఫేస్ మాస్కులు ధరించాలని సూచించారు.( దేశంలో కరోనా వైరస్ బారిన పడి మృతి చెందినవారి సంఖ్య లక్షా 41 వేలకు పెరిగింది.) భౌతిక దూరాన్ని పాటించలేనప్పుడు మాస్కులు తప్పనిసరి అని ట్రంప్ వ్యాఖ్యానించారు.  ఈ వైరస్ ని అదుపు చేయడమే కాదు.. ఇది పూర్తిగా అంతమయ్యేలా చూడాలి.. కోవిడ్ 19 వ్యాక్సీన్ ఉత్పాదన కోసం అనేక దేశాలు కృషి చేస్తున్నాయని, ఏ దేశం విజయవంతంగా ఈ రేసులో మొదటి స్థానంలో వచ్చినా  ఆ దేశంతో కలిసి పని చేసేందుకు తమ ప్రభుత్వం  రెడీగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో చైనాతో సరే అని తొలిసారిగా వ్యాఖ్యానించారు.