ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త.. హెచ్‌సీఎల్ టెక్‌లో 15 వేల నియామకాలు..
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్తల కుదేలయ్యాయి. ఈ క్రమంలో దిగ్గజ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్తల కుదేలయ్యాయి. ఈ క్రమంలో దిగ్గజ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15వేల మంది ఫ్రెషర్ల నియామకాలను చేపట్టనున్నట్టు ప్రకటించింది. కరోనావైరస్ టెక్ కంపెనీలను తీవ్రంగా దెబ్బతీసినప్పటికీ, బలమైన డిమాండ్, వృద్ధి అంచనాల నేపథ్యంలో ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాల కల్పనకు మొగ్గుచూపుతున్నాయి. ఈ క్రమంలో హెచ్‌సీఎల్ కూడా క్యాంపస్ రిక్రూట్‌మెంట్లపై దృష్టి పెట్టింది.
కరోనా సంక్షోభ సమయం కాబట్టి.. హెచ్‌సీఎల్ తన నియామకాలను వర్చువల్‌గా చేపట్టనుంది. గత ఏడాది 9వేలమందిని ఎంపిక చేసుకున్న సంస్థ ఈ ఏడాది అదనంగా మరో 6 వేల మందిని చేర్చుకోనుంది. అయితే కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా క్యాంపస్‌లలో ప్రెషర్ల ఎంపిక ప్రక్రియ నెమ్మదిగా ఉందని ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సుమారు 1000 మంది ఫ్రెషర్లను నియమించుకున్నట్టు తెలిపింది. అయితే ఈ ఏడాది కంపెనీని వీడే ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిందని హెచ్‌ఆర్ హెడ్ వీవీ అప్పారావు తెలిపారు.